Bheemla Nayak: భీమ్లా నాయక్‌ దసరా సర్‌ప్రైజ్‌ వచ్చేసింది! - telugu news second single out from bheemlanayak
close
Updated : 15/10/2021 12:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Bheemla Nayak: భీమ్లా నాయక్‌ దసరా సర్‌ప్రైజ్‌ వచ్చేసింది!

హైదరాబాద్‌: పవర్‌స్టార్‌ అభిమానులకు దసరా స్పెషల్‌ సర్‌ప్రైజ్‌ వచ్చేసింది. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ‘భీమ్లానాయక్‌’ నుంచి రెండో పాట విడుదలైంది. మలయాళంలో సూపర్‌హిట్‌ విజయాన్ని అందుకున్న ‘అయ్యప్పనుమ్‌ కోషియమ్‌’ రీమేక్‌గా ‘భీమ్లానాయక్‌’ సిద్ధమవుతోన్న విషయం తెలిసిందే. పవన్‌కల్యాణ్- రానా కీలకపాత్రల్లో నటిస్తున్నారు. కాగా, దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఉదయం ఈ సినిమా నుంచి ‘అంత ఇష్టం’ అంటూ సాగే ఓ పాటను చిత్రబృందం సోషల్‌మీడియాలో షేర్‌ చేసింది. రామజోగయ్య శాస్త్రి అందించిన సాహిత్యం.. తమన్‌ అందించిన స్వరాలు ఈపాటను మరోస్థాయికి తీసుకు వెళ్లాయి.

ఒరిజినల్‌లో బీజుమేనన్‌ పోషించిన పాత్రను తెలుగులో పవన్‌కల్యాణ్‌.. పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ పాత్రను రానా రీక్రియేట్‌ చేస్తున్నారు. ఇందులో పవన్‌ సతీమణి పాత్ర నిత్యామేనన్‌ సందడి చేయనున్న విషయం తెలిసిందే. సాగర్‌ కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్య దేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.



Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని