Sree Vishnu: ఓటీటీలో శ్రీవిష్ణు ‘రాజ రాజ చోర’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే? - telugu news sree vishnu movie rajaraja chora on ott
close
Published : 25/09/2021 01:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Sree Vishnu: ఓటీటీలో శ్రీవిష్ణు ‘రాజ రాజ చోర’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

ఇంటర్నెట్‌ డెస్క్‌: కొవిడ్ సెకండ్ వేవ్ తర్వాత థియేటర్లలో విడుదలై ప్రేక్షకులకి మంచి వినోదం పంచిన చిత్రం ‘రాజ రాజ చోర’. కామెడీ ప్రధానంగా రూపొందిన ఈ సినిమాకి విశేష స్పందన లభించింది. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ వేదికగా అలరించేందుకు సిద్ధమైంది. అక్టోబరు 8 నుంచి ‘జీ 5’లో స్ట్రీమింగ్‌కానుంది. శ్రీ విష్ణు కథానాయకుడిగా హసిత్‌ గోలి తెరకెక్కించిన సినిమా ఇది. మేఘా ఆకాశ్‌, సునయన కథానాయికలు.

స్టేష‌న‌రీ షాప్‌లో పనిచేసే భాస్క‌ర్ (శ్రీవిష్ణు) తాను సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అని చెప్పుకుంటూ సంజ‌న (మేఘ ఆకాష్‌)తో  ప్రేమాయ‌ణం సాగిస్తుంటాడు.  అవ‌స‌రాలు అత‌న్ని ఓ దొంగలా మార్చేస్తాయి. అనూహ్య ప‌రిణామాల త‌ర్వాత  భాస్క‌ర్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కాద‌నీ... అత‌నికి విద్య (సునయన) అనే మ‌రో అమ్మాయితో పెళ్ల‌య్యింద‌ని, వాళ్లిద్ద‌రికీ ఓ అబ్బాయి కూడా ఉన్నాడ‌నే విష‌యం సంజ‌న‌కి తెలుస్తుంది. మ‌రి నిజంగానే భాస్క‌ర్‌కి పెళ్ల‌యిందా? దొంగగా ప‌ట్టుబ‌డి పోలీసులకి చిక్కిన భాస్క‌ర్ జీవితం ఎలాంటి మ‌లుపులు తిరిగిందనేది ‘రాజ రాజ చోర’ కథ. ఆద్యంతం అలరించేలా తీర్చిదిద్దిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి టాక్‌ తెచ్చుకుంది. కథ, కథనాలు, శ్రీవిష్ణు నటన ప్రేక్షకులను మెప్పించింది. ఇప్పుడు ఓటీటీలో అలరించేందుకు సిద్ధమైంది. అక్టోబరు 8 నుంచి ‘జీ 5’లో స్ట్రీమింగ్‌ కానుంది.

రవిబాబు, తనికెళ్ల భరణి, శ్రీకాంత్ అయ్యంగార్‌, అజయ్‌ ఘోష్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకి సంగీతం: వివేక్‌ సాగర్‌, సినిమాటోగ్రఫీ: వేద రమణ్‌ శంకరన్‌; ఎడిటింగ్‌: విప్లవ్‌; నిర్మాత: అభిషేక్‌ అగర్వాల్‌, టీజీ విశ్వ ప్రసాద్‌.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని