Sridevi Drama Company: ప్రతిభ ముందు అంగవైకల్యం చిన్నబోయింది! - telugu news sridevi drama comapany latest promo sudheer indraja
close
Published : 19/10/2021 23:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Sridevi Drama Company: ప్రతిభ ముందు అంగవైకల్యం చిన్నబోయింది!

ఇంటర్నెట్‌ డెస్క్: వినోదంతోపాటు దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతుల్ని పరిచయం చేసే బుల్లితెర కార్యక్రమం ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’. సుధీర్‌ వ్యాఖ్యాతగా ‘ఈటీవీ’లో ప్రతి ఆదివారం ప్రసారమయ్యే షో ఇది. ఈ వారం ఎపిసోడ్‌ ఎలా ఉండబోతుందో తెలియజేసే ప్రోమో వచ్చేసింది. ఈ వీడియోలో.. అంగవైకల్యం ఉన్న కొందరి డ్యాన్సు పెర్ఫామెన్స్‌ ప్రత్యేకంగా నిలిచింది. అంగవైకల్యం అనేది శరీరానికి సంబంధించిందే తప్ప మనసుకి సంబంధించింది కాదని నిరూపించారు. హృదయాల్ని హత్తుకున్నారు. ‘వీరిని చూసి ఎలా బతకాలో నేర్చుకోవాలి’ అని ఆది, ‘మీ తపన ముందు మిగతావన్నీ చిన్నబోయాయి’ అని గెటప్‌ శ్రీను ఉద్వేగంతో మాట్లాడారు. మరోవైపు, తల్లీదండ్రులు లేని కొందరు చిన్నారులు ఈ షోకి విచ్చేసి, తమ పరిస్థితి గురించి వివరించి కంటతడి పెట్టించారు. ‘బిగ్‌బాస్‌’ ఫేం సోహైల్‌, దేత్తడి హారిక అతిథులుగా మెరిశారు. ‘భీమ్లా నాయక్‌’ పాటకి సోహైల్‌, ‘దిగు దిగు దిగునాగ’ గీతానికి హారిక తమదైన శైలిలో డ్యాన్స్‌ చేశారు. ఉర్రూతలూగించారు. ఎప్పటిలానే ఆది పంచ్‌లు నవ్వులు పూయించాయి. ఈ హంగామా అంతా చూడాలంటే అక్టోబరు 24 వరకు ఆగాల్సిందే. 



Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని