‘తిమ్మరుసు’, ‘డియర్‌ మేఘ’ నుంచి కొత్త సాంగ్స్‌ - telugu news timmarusu and dear megha movie songs released by samantha pooja hegde
close
Published : 16/07/2021 22:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘తిమ్మరుసు’, ‘డియర్‌ మేఘ’ నుంచి కొత్త సాంగ్స్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: యువ నటుడు సత్యదేవ్‌ లాయరు పాత్రలో నటించిన చిత్రం ‘తిమ్మరుసు’. శరణ్‌ కొప్పిశెట్టి దర్శకత్వం వహించారు. ప్రియాంక జవాల్కర్‌ నాయిక. ఈ సినిమా జులై 30న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ‘ది తిమ్మరుసు’ అంటూ సాగే ప్రమోషన్‌ సాంగ్‌ని విడుదల చేసింది ప్రముఖ నాయిక సమంత. ‘వెల్‌కమ్‌ టు తిమ్మరుసు ఫ్యాక్ట్స్‌.. ఈ సినిమాలో ఓ లవ్‌ సాంగ్‌ ఉండాలి కానీ నిడివి ఎక్కువ అయిందని తీసేశాం. తర్వాత ఈవిడ (ప్రియాంక జవాల్కర్‌) గోల ఎక్కువైంది. ఈ కోసమే ఈ ప్రమోషన్‌ సాంగ్‌’ అంటూ సత్యదేవ్‌ చెప్పిన డైలాగ్‌తో ప్రారంభమైంది ఈ గీతం. ఈ వీడియోలో సత్యదేవ్‌, ప్రియాంకతోపాటు బ్రహ్మాజీ, వైవా హర్ష కనిపించారు. కిట్టు విస్సాప్రగడ రచించిన ఈ పాటని రఘు దీక్షిత్‌ ఆలపించారు. జ్యోత్స్న పాకాల, అంబికా, యామిని ఘంటసాల కోరస్‌ అందించారు. శ్రీచరణ్ పాకాల స్వరాలు సమకూర్చారు. నటీనటుల స్టెప్పులు, సినిమాలోని కొన్ని సన్నివేశాలతో రూపొందించిన ఈ వీడియో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునేలా ఉంది. ఈస్ట్‌ కోస్ట్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై మహేశ్‌ ఎస్‌. కోనేరు నిర్మించిన ఈ ‘తిమ్మరుసు’ కథేంటి? తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

‘డియర్‌ మేఘ’.. ఆమని ఉంటే పక్కన

అదిత్‌ అరుణ్‌, మేఘా ఆకాశ్‌ జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘డియర్‌ మేఘ’. సుశాంత్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలోని ‘ఆమని ఉంటే పక్కన’ అంటూ సాగే మెలొడీని నాయిక పూజా హెగ్డే తాజాగా విడుదల చేసింది. కృష్ణకాంత్‌ సాహిత్యం అందించగా అనురాగ్‌ కులకర్ణి ఆలపించారు. గౌర హరి స్వరాలు సమకూర్చారు. ఈ లిరికల్‌ వీడియోలో నాయకానాయికల హావభావాలు ఆకట్టుకుంటున్నాయి. అర్జున్‌ దాస్యన్‌ నిర్మించిన ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.





మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని