Tuck Jagadish: ‘నీదీ నాదంటూ’ ఫుల్‌ వీడియో వచ్చేసింది..! - telugu news tuck jagadish full video song
close
Updated : 18/09/2021 09:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Tuck Jagadish: ‘నీదీ నాదంటూ’ ఫుల్‌ వీడియో వచ్చేసింది..!

ఇంటర్నెట్ డెస్క్‌: నాని నటించిన కుటుంబ కథా చిత్రం ‘టక్‌ జగదీష్‌’. శివ నిర్వాణ దర్శకుడు. రీతూవర్మ కథానాయిక. జగపతి బాబు, ఐశ్వర్య రాజేశ్‌ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ప్రముఖ ఓటీటీ అమెజాన్‌ ప్రైమ్‌లో సెప్టెంబరు 9 నుంచి స్ట్రీమింగ్‌ అవుతోంది. ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తుండటంతో సినీ అభిమానులకి చిత్ర బృందం ఓ సర్‌ప్రైజ్‌ అందించింది. ‘నీదీ నాదంటూ’ ఫుల్‌ వీడియో సాంగ్‌ని విడుదల చేసింది. కల్యాణ్‌ చక్రవర్తి రచించిన ఈ గీతాన్ని శ్రీకృష్ణ, నూతన మోహన్‌ ఆలపించారు. తమన్‌ సంగీతం అందించారు. ఈ పాటలో నాని, రీతూవర్మ ప్రభుత్వ అధికారులుగా రైతు సమస్యల్ని పరిష్కరిస్తూ కనిపించారు. ఈ సాంగ్‌లో పంటపొలాల లొకేషన్లు ఆకట్టుకుంటున్నాయి. ఇంకెందుకు ఆలస్యం మీరూ చూసేయండి..




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని