‘వాలిమై’ గీతాలాపన - telugu news valimai first song out now
close
Published : 04/08/2021 10:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘వాలిమై’ గీతాలాపన

చెన్నై: అజిత్‌ కథానాయకుడిగా హెచ్‌.వినోద్‌ రూపొందిస్తున్న చిత్రం ‘వాలిమై’. జీస్టూడియోస్‌తో కలిసి బోనీ కపూర్‌ నిర్మిస్తున్నారు. యువన్‌ శంకర్‌ రాజా స్వరాలందిస్తున్నారు. మూడు రోజుల యాక్షన్‌ పార్ట్‌ మినహా చిత్రీకరణ దాదాపు పూర్తయింది. నిర్మాణాంతర పనులు ముగింపు దశకు చేరుకున్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి  ‘‘నాన్‌గ వేరా మారి’’ అనే గీతాన్ని విడుదల చేశారు. ఈ పాటకు విగ్నేశ్‌ శివన్‌ సాహిత్యం అందించగా.. అనురాగ్‌ కులకర్ణి, యువన్‌ శంకర్‌ రాజా ఆలపించారు. యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో.. అజిత్‌ సీబీసీఐడీ అధికారిగా కనిపించనున్నారు. తెలుగు కథానాయకుడు కార్తికేయ ప్రతినాయకుడిగా కనిపిస్తారు. హ్యూమా ఖురేషి కథానాయిక. ఈ చిత్రం ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని