Varudu Kavalenu: ఫోక్‌ సాంగ్‌తో అదరగొట్టిన శ్రేయాఘోషల్‌ - telugu news varudu kavalenu folk song out now
close
Updated : 04/08/2021 14:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Varudu Kavalenu: ఫోక్‌ సాంగ్‌తో అదరగొట్టిన శ్రేయాఘోషల్‌

హైదరాబాద్‌: తన మధురమైన స్వరంతో ఎన్నో మెలోడీలను ఆలపించి సినీ సంగీత ప్రియుల్ని అలరించిన గాయని శ్రేయాఘోషల్‌ సరికొత్తగా ఫోక్‌ సాంగ్‌తో అదరగొట్టారు. ‘దిగు దిగు దిగు నాగ’ అంటూ మెప్పించారు. నాగశౌర్య కథానాయకుడిగా తెరకెక్కుతోన్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘వరుడు కావలెను’.  లక్ష్మీ సౌజన్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శౌర్యకు జంటగా రీతూవర్మ సందడి చేయనున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ‘కోలా కళ్లే ఇలా’ సాంగ్‌కు మంచి ఆదరణ లభించింది. తాజాగా ‘దిగు దిగు దిగు నాగ’ లిరికల్‌ పాటను బుధవారం చిత్రబృందం నెట్టింట్లో షేర్‌ చేసింది. ప్రస్తుతం ఈ పాట ఆకట్టుకుంటోంది.

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి సూర్యదేవర నాగవంశీ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇందులో నాగశౌర్య క్లాస్‌ లుక్‌లో కనిపించనున్నారు. మురళీ శర్మ, నదియా, వెన్నెల కిషోర్‌, ప్రవీణ్‌ కీలకపాత్రలు పోషించారు. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని