Bichagadu 2: విజయ్‌ స్వీయ దర్శకత్వంలో ‘బిచ్చగాడు 2’ - telugu news vijay anthony to direct bichagadu 2
close
Published : 25/07/2021 09:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Bichagadu 2: విజయ్‌ స్వీయ దర్శకత్వంలో ‘బిచ్చగాడు 2’

చెన్నై: ‘బిచ్చగాడు’ చిత్రంతో తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకుల్లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు విజయ్‌ ఆంటోని. ఐదేళ్ల క్రితం ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా.. బాక్సాఫీస్‌ సంచలన  విజయాన్ని అందుకొని చక్కటి వసూళ్లు సాధించింది. హీరోగా  విజయ్‌కు మంచి పేరు తెచ్చి    పెట్టింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడీ సినిమాకి సీక్వెల్‌గా ‘బిచ్చగాడు 2’ తీసుకొచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయాన్ని విజయ్‌ ఆంటోని గతంలోనే ప్రకటించారు. అయితే దర్శకుడెవరన్నది స్పష్టత ఇవ్వలేదు. శనివారం ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రశ్నకు సమాధానం దొరికింది. ఈ చిత్రం తెరకెక్కించనున్నది ఎవరన్నది దర్శకుడు   మురుగదాస్‌ రివీల్‌ చేశారు. ఈ రెండో భాగాన్ని హీరో విజయ్‌ ఆంటోనినే స్వయంగా తెరకెక్కించనున్నారని తెలియజేశారు. అంతేకాదు ఆయన ఈ సినిమాకి నిర్మాతగానూ, సంగీత దర్శకుడిగానూ వ్యవహరించనున్నారు. ప్రముఖ రచయిత భాష్య శ్రీ మాటలు అందిస్తారు. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడించనున్నట్లు తెలిపారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని