Vijay Sethupathi: ‘తుగ్లక్‌ దర్బార్‌’.. సింగారవేలన్‌ రాజకీయ వ్యూహం ఏంటి?  - telugu news vijay sethupathi tughlaq durbar trailer
close
Published : 31/08/2021 18:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Vijay Sethupathi: ‘తుగ్లక్‌ దర్బార్‌’.. సింగారవేలన్‌ రాజకీయ వ్యూహం ఏంటి? 

ఇంటర్నెట్‌ డెస్క్‌: విజయ్‌ సేతుపతి కథానాయకుడిగా రాజకీయ నేపథ్యంగా రూపొందిన చిత్రం ‘తుగ్లక్‌ దర్బార్‌’. రాశీ ఖన్నా, మంజిమా మోహన్‌ కథానాయికలు. దిల్లీ ప్రసాద్‌ దీనదయాళన్‌ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో సెప్టెంబరు 11 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ట్రైలర్‌ని విడుదల చేసింది. ఇందులో విజయ్‌ సేతుపతి సింగారవేలన్‌ అనే పాత్రలో కనిపించారు. విభిన్న లుక్స్‌తో ఆకట్టుకుంటున్నారు. సరదా, సీరియస్‌ సన్నివేశాల్లో తన మార్క్‌ వైవిధ్యాన్ని ప్రదర్శించారు. రాజకీయ నేపథ్యంలో సాగే సంభాషణలు మెప్పిస్తున్నాయి. ఓ రాజకీయ నాయకుడ్ని అమితంగా ఇష్టపడే సింగారవేలన్‌ (విజయ్‌ సేతుపతి), ఆ నాయకుడి కోసం ప్రాణ త్యాగానికీ సిద్ధపడే సీన్‌ సినిమాపై ఆసక్తిని పెంచేలా ఉంది. మరి ఆ నాయకుడు ఎవరు? ఏ ఉద్దేశంతో అలా మాట్లాడాడు? సింగారవేలన్‌ రాజకీయ వ్యూహం ఏంటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎస్‌.ఎస్‌. లలిత్‌ కుమార్‌ నిర్మించిన ఈ సినిమాకి సంగీతం: గోవింద్‌ వసంత, కూర్పు: గోవింద రాజ్‌, ఛాయాగ్రహణం: మనోజ్‌ పరమహంస, మహేంద్రన్‌ జయరాజ్‌.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని