Samantha: అక్కినేని ఇంట డిన్నర్‌ పార్టీ.. సమంత మిస్..? - telugu news was samantha skipped family dinner with aamir khan
close
Published : 25/09/2021 12:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Samantha: అక్కినేని ఇంట డిన్నర్‌ పార్టీ.. సమంత మిస్..?

హైదరాబాద్‌: ‘లవ్‌స్టోరీ’తో సూపర్‌ సక్సెస్‌ సొంతం చేసుకున్నారు నటుడు అక్కినేని నాగచైతన్య. దీంతో నాగచైతన్యతోపాటు చిత్రబృందం మొత్తం ‘లవ్‌స్టోరీ’ సక్సెస్‌ సెలబ్రేషన్స్‌లో ఫుల్‌ బిజీగా పాల్గొంటోంది. మరోవైపు ఆ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుకకు గౌరవ అతిథిగా విచ్చేసిన ఆమిర్‌ఖాన్‌కి నాగార్జున ఫ్యామిలీ స్పెషల్‌ డిన్నర్‌ పార్టీ ఇచ్చింది. ఈ పార్టీకి నాగార్జున, నాగచైతన్య, అఖిల్‌తోపాటు దర్శకుడు శేఖర్‌ కమ్ముల, సాయిపల్లవి హాజరై సరదాగా గడిపారు. తాజాగా ఈ ఫొటో బయటకు వచ్చింది. ఇందులో సమంత కనిపించకపోవడం గమనార్హం.

నాగచైతన్య-సాయిపల్లవి జంటగా నటించిన క్లాసిక్‌ ప్రేమకథా చిత్రం ‘లవ్‌స్టోరీ’. శేఖర్‌ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నాగచైతన్య రేవంత్‌ అనే మధ్య తరగతి అబ్బాయిగా నటించారు. ఇక, సాయిపల్లవి ఎప్పటిలానే తన గ్రేస్‌తో అందర్నీ ఫిదా చేసింది. శ్రీవేంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై నారాయణ దాస్ ఈ చిత్రాన్ని నిర్మించారు.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని