MAA Elections: ప్రకాశ్‌రాజ్‌ ప్యానెల్‌ సభ్యుల రాజీనామా.. లేఖలు అందలేదు: మంచు విష్ణు - telugu news we did not get any resignation letter from maa members says manchu vishnu
close
Updated : 18/10/2021 12:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

MAA Elections: ప్రకాశ్‌రాజ్‌ ప్యానెల్‌ సభ్యుల రాజీనామా.. లేఖలు అందలేదు: మంచు విష్ణు

హైదరాబాద్‌: మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ‘మా’ ఎన్నికల్లో విజయం సాధించినప్పటికీ తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ఇటీవల ప్రకాశ్‌రాజ్‌ ప్యానెల్‌ సభ్యులు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ‘మా’ నూతన అధ్యక్షుడు మంచు విష్ణు దీనిపై స్పందించారు. తన తండ్రి మోహన్‌బాబు, ప్యానెల్‌ సభ్యులతో కలిసి ఆయన సోమవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

‘‘మా’ ఎన్నికల్లో విజయం సాధించి.. అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించడం ఎంతో ఆనందంగా ఉంది. ఎన్నికల్లో నా ప్యానెల్‌ ఎంతో కష్టపడింది. స్వామి వారి ఆశీస్సులు తీసుకోవడానికి ఇక్కడికి వచ్చాం. అసోసియేషన్‌ అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తాను. ప్రకాశ్‌రాజ్‌ ప్యానెల్‌ సభ్యులు రాజీనామాలు చేశారని.. మీడియా ద్వారానే తెలిసింది. వాళ్ల రాజీనామా లేఖలు ఇంకా మాకు అందలేదు. రాజీనామా లేఖలు అందాక  ఆ విషయంపై స్పందిస్తాను’ అని విష్ణు అన్నారు.

అక్టోబర్‌ 10న జరిగిన ‘మా’ ఎన్నికల్లో ప్రకాశ్‌రాజ్‌ ప్యానెల్‌  సిని‘మా’ బిడ్డలం నుంచి గెలిచిన 11 మంది సభ్యులు తమ పదవులకి రాజీనామా చేశారు. ‘మా’ సంక్షేమం కోసమే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు వారు తెలిపారు.



Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని