Lovestory: విన్నర్‌ బ్రో వీడియో వచ్చేసింది..! - telugu news winner winner bro video song out from lovestory
close
Published : 22/10/2021 13:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Lovestory: విన్నర్‌ బ్రో వీడియో వచ్చేసింది..!

హైదరాబాద్‌: నాగచైతన్య-సాయిపల్లవి జంటగా నటించిన ప్రేమకథా చిత్రం ‘లవ్‌స్టోరీ’. సమాజంలో ఉన్న కుల వివక్షతను తెలియజేస్తూ తెరకెక్కిన ఈ ప్రేమకథా చిత్రం గత నెలలో విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. జుంబా ట్రైనర్‌, మధ్యతరగతి కుర్రాడిగా నాగచైతన్య,  జీవితంలో ఏదైనా సాధించాలని కలలు కనే అమ్మాయిగా సాయిపల్లవిల నటన సినిమాని మరోస్థాయికి తీసుకువెళ్లాయి. సాయిపల్లవి డ్యాన్స్‌పై సినీ ప్రియుల నుంచే కాకుండా ప్రముఖుల నుంచి కూడా ప్రశంసలు లభించాయి. కాగా, శుక్రవారం నుంచి ఈ సినిమా ఆహా ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా, తాజాగా ఈ సినిమా నుంచి ‘విన్నర్‌ బ్రో’ ఫుల్‌ వీడియో సాంగ్‌ను చిత్రబృందం సోషల్‌మీడియా వేదికగా షేర్‌ చేసింది. ఇందులో సాయిపల్లవి, నాగచైతన్యల డ్యాన్స్‌ ఆకట్టుకునేలా ఉంది. శేఖర్‌ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర సినిమాస్‌ పతాకంపై నారాయణ దాస్‌ నిర్మించారు. ఏఆర్‌ రెహమాన్‌ శిష్యుడు పవన్‌ ఈ చిత్రానికి స్వరాలు అందించారు. 




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని