Chiru153.. తమన్‌ మొదలు పెట్టేశాడు.. కల నెరవేరబోతోందంటూ ట్వీట్‌ - thaman busy in composing music for lucifer
close
Published : 26/07/2021 22:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Chiru153.. తమన్‌ మొదలు పెట్టేశాడు.. కల నెరవేరబోతోందంటూ ట్వీట్‌

ఇంటర్నెట్‌ డెస్క్: టాలీవుడ్‌లో టాప్‌ గేర్‌లో దూసుకెళుతున్న సంగీత దర్శకుడు తమన్‌. రికార్డింగ్‌ పనుల్లో బిజీబిజీగా గడుపుతున్నాడు. మెగాస్టార్‌ చిరంజీవి, డైరెక్టర్‌ మోహన్‌రాజా కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కేందుకు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే. మలయాళ సూపర్‌ హిట్‌ చిత్రం ‘లూసీఫర్‌’కు రీమేక్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఆ సినిమాకు తమన్‌ సంగీతం అందిస్తున్నారు. అయితే.. టాలీవుడ్‌లో బిజీ మ్యూజిక్‌ డైరెక్టర్లలో ఒకరైన తమన్‌ ఏమాత్రం సమయం వృథా చేయడం లేదు. సినిమా రికార్డింగ్‌ పనులు మొదలు పెట్టాడు. చిరంజీవితో కలిసి పనిచేయడం సంతోషంగా ఉందని ఆయన ట్విటర్‌లో తన ఆనందాన్ని పంచుకున్నారు. ‘నా జీవితంలో ఇది అద్భుతమైన రోజు. నా కల నెరవేరబోతోంది. మనకు ఎంతో ఇష్టమైన మెగాస్టార్‌ చిరంజీవి గారి సినిమాకు మొదటి పాట రికార్డు చేయబోతున్నాం. లండన్‌లోని అబ్బేరోడ్ స్టూడియోలో పని చేస్తున్నాం. ఇది వేడుక చేసుకోవాల్సిన సమయం’’ అంటూ తమన్‌ ట్వీట్‌ చేశారు.

ప్రస్తుతం చిరంజీవి ప్రధానపాత్రలో నటించిన ‘ఆచార్య’ విడుదలకు సిద్ధంగా ఉంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రామ్‌చరణ్‌ కూడా నటిస్తున్నారు. కాజల్‌ నాయిక. రామ్‌చరణ్‌, పూజా హెగ్డే కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఇదిలా ఉండగా.. చిరు153తో పాటు తమన్‌ మరో మెగా హీరోకూ సంగీతం అందించే ఛాన్స్‌ కొట్టేశాడు. మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్‌ కథానాయకుడిగా ప్రముఖ దర్శకుడు శంకర్‌ కాంబినేషన్‌లో ఓ బిగ్గెస్ట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఆ సినిమాకు తమన్‌ స్వరాలు అందించనున్నారు.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని