Anasuya: ‘థ్యాంక్ యు బ్రదర్‌’ కోసం కష్టపడిందిలా! - thank you brother making
close
Published : 27/05/2021 00:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Anasuya: ‘థ్యాంక్ యు బ్రదర్‌’ కోసం కష్టపడిందిలా!

ఇంటర్నెట్‌ డెస్క్: అనసూయ, అశ్విన్ విరాజ్ ప్రధాన పాత్రల్లో తెర‌కెక్కిన‌ చిత్రం ‘థ్యాంక్ యు బ్రదర్‌’. రమేష్‌ రాపర్తి దర్శకత్వం వ‌హించారు. మే 7న ఓటీటీ ‘ఆహా’ వేదికగా విడుద‌లై అన్ని వ‌ర్గాల ప్రేక్షకుల్ని అల‌రిస్తోంది. ఈ నేప‌థ్యంలో సినిమా మేకింగ్ విడుద‌లైంది. లిఫ్ట్‌లో అన‌సూయ‌, విరాజ్‌ల మ‌ధ్య జ‌రిగే కీల‌క స‌న్నివేశాన్ని ఎలా తెర‌కెక్కించారో ఇందులో చూడొచ్చు. ఈ చిత్రంలో అన‌సూయ గ‌ర్భ‌వ‌తి పాత్ర పోషించింది. ఈ పాత్రకోసం చిత్రబృందం ఎంత క‌ష్ట‌ప‌డిందో ఈ వీడియో తెలియ‌జేస్తుంది. 
ఈ చిత్రాన్ని జస్ట్ ఆర్డినరి ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై మాగుంట శరత్‌చంద్రారెడ్డి, తారక్‌ బొమ్మిరెడ్డి సంయుక్తంగా నిర్మించారు. మౌనికా రెడ్డి, ఆదర్శ్‌ బాలకృష్ణ, అన్నపూర్ణ, వైవా హర్ష, కాదంబరి కిరణ్‌ తదితరులు కీల‌క పాత్ర‌లు పోషించారు. గుణ బాలసుబ్రమణ్యం సంగీతం అందించారు.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని