శర్వానంద్‌కు చెర్రీ పార్టీ..! - thank you cherry for your great party says sharwa
close
Published : 06/03/2021 13:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

శర్వానంద్‌కు చెర్రీ పార్టీ..!

వైరల్‌గా మారిన ఫొటోలు

హైదరాబాద్‌: నటుడు శర్వానంద్‌కు రామ్‌చరణ్‌ తేజ్‌ స్పెషల్‌ పార్టీ ఇచ్చారు. శనివారం శర్వానంద్‌ పుట్టినరోజు. ఈ సందర్భంగా చరణ్‌ శుక్రవారం రాత్రి బర్త్‌డే బాయ్‌కి శుభాకాంక్షలు తెలుపుతూ ప్రత్యేకంగా విందు ఇచ్చారు. దీనికి సంబంధించిన ఫొటోలను శర్వా తాజాగా ట్విటర్‌ వేదికగా షేర్‌ చేస్తూ.. ‘పార్టీ ఇచ్చినందుకు థ్యాంక్యూ చెర్రీ’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. స్కూల్‌లో ఉన్నప్పుడు చెర్రీ.. శర్వా క్లాస్‌మేట్స్‌. దీంతో వీరిద్దరూ చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. అందుకే ప్రతి ఏడాది శర్వా పుట్టినరోజుకు చరణ్‌ ప్రత్యేకంగా పార్టీ ఇస్తుంటారు. ఇదిలా ఉండగా, ఆప్తమిత్రులైన వీరిద్దరూ బంధువులుగా మారనున్నారంటూ ఒకానొక సమయంలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఈ వార్తలపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

సినిమాల విషయానికి వస్తే.. శర్వానంద్‌ ప్రస్తుతం ‘శ్రీకారం’ విడుదల పనుల్లో బిజీగా ఉన్నారు. కిషోర్‌.బి దర్శకత్వం వహించిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ మార్చి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనితోపాటు ‘మహాసముద్రం’ చిత్రంలోనూ నటిస్తున్నారు. ఇక రామ్‌చరణ్‌ ప్రస్తుతం ‘ఆచార్య’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ పనుల్లో బిజీగా ఉన్నారు. ‘ఆచార్య’ షూట్‌లో భాగంగా ఆయన తూర్పుగోదావరి జిల్లా వెళ్లి వచ్చారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని