The Baker and The Beauty: పేరుకే మహేశ్వరి.. తేడా కొడితే మహంకాళేశ్వరి - the baker the beauty trailer
close
Published : 06/09/2021 20:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

The Baker and The Beauty: పేరుకే మహేశ్వరి.. తేడా కొడితే మహంకాళేశ్వరి

హైదరాబాద్‌: సంతోష్‌ శోభన్, విష్ణుప్రియ, టీనా శిల్పారాజ్‌, వెంకట్‌, యాంకర్‌ ఝాన్సీ ప్రధాన ప్రాతల్లో నటించిన చిత్రం ‘ది బేకరీ అండ్‌ ది బ్యూటీ’. జోనాథన్‌ ఎడ్వార్డ్స్‌  దర్శకత్వం వహించిన ఈ చిత్రం సెప్టెంబరు10 (శుక్రవారం) ప్రముఖ తెలుగు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ ‘ఆహా’ వేదికగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సోమవారం ఈ సినిమా ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. సుప్రియ యార్లగడ్డ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ‘పేరుకే మహేశ్వరి.. తేడా కొడితే మహంకాళేశ్వరి’ అంటూ పంచ్‌ డైలాగ్‌తో ప్రారంభమైన ట్రైలర్ ఆద్యంతం అలరించేలా సాగింది. లవ్‌, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను తీర్చిదిద్దినట్లు ట్రైలర్‌ చూస్తే అర్థమవుతోంది. మరి అందమైన అమ్మాయికి బేకరికీ మధ్య ఉన్న సంబంధమేమిటో తెలియాలంటే సినిమా విడుదలవరకు ఆగాల్సిందే!




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని