బ్రదర్‌.. నీతో స్నేహం మధురమైనది: ఎన్టీఆర్‌ - this year is going to be remarkable for us ntr wishes on ramcharan birthday
close
Published : 27/03/2021 16:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బ్రదర్‌.. నీతో స్నేహం మధురమైనది: ఎన్టీఆర్‌

రామరాజుకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పిన కొమురం భీమ్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: రామ్‌చరణ్‌ పుట్టినరోజు సందర్భంగా సామాజిక మాధ్యమాల వేదికగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. చరణ్‌తో తాము దిగిన ఫొటోలు పంచుకుంటూ పలువురు సినీతారలు ట్వీట్‌లు చేస్తూ శుభాకాంక్షలు చెబుతున్నారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ కొమురం భీమ్‌ ఎన్టీఆర్‌ సైతం తాజాగా.. ట్విటర్‌ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. ‘ఈ సంవత్సరం మనకు గొప్పగా మారబోతోంది. నీతో గడిపిన క్షణాలు ఎప్పటికీ మధురమైనవే బ్రదర్‌. జన్మదిన శుభాకాంక్షలు’ అంటూ తారక్‌ చరణ్‌తో దిగిన ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో రామ్‌చరణ్‌ అల్లూరి సీతా రామరాజుగా నటిస్తున్న సంగతి తెలిసిందే.

శుక్రవారం రాత్రి అంటే.. పుట్టినరోజుకు ఒకరోజు ముందుగానే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సెట్లో చరణ్‌ జన్మదిన వేడుకలు నిర్వహించారు. దర్శకుడు రాజమౌళి స్వయంగా చరణ్‌కు కేక్‌ తినిపించారు. అనంతరం అందరితో కలిసి చరణ్‌ ఫొటోలు దిగారు. ఆ ఫొటోలను ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తన అధికారిక ట్విటర్‌ హ్యాండిల్‌ ద్వారా అభిమానులతో పంచుకుంది. చరణ్‌ పుట్టినరోజు సందర్భంగా హీరోలు మోహన్‌లాల్‌, అల్లు అర్జున్‌, రానా, వరుణ్‌తేజ్‌, శ్రీకాంత్‌, ప్రదీప్‌ మాచిరాజు, హీరోయిన్లు కాజల్‌, ఈషారెబ్బ, డైరెక్టర్లు గోపీచంద్‌ మలినేని, సురేందర్‌రెడ్డి, బాబీతో పాటు చాలా మంది ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా చరణ్‌కు శుభాకాంక్షలు చెబుతున్నారు. #HBDRamCharan హ్యాష్‌టాగ్‌ ట్విటర్‌లో ట్రెండింగ్‌లో దూసుకెళుతోంది.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని