close
Published : 26/06/2020 09:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మూడు గెటప్పులు.. హాలీవుడ్‌ నిపుణులు!

హైదరాబాద్‌: కథానాయకుడు నితిన్‌ వరుస చిత్రాలతో జోరు చూపిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ‘రంగ్‌ దే’, ‘అంధాధూన్‌’ రీమేక్‌ చిత్రాలతో పాటు చంద్రశేఖర్‌ యేలేటి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇవన్నీ ఇప్పటికే సెట్స్‌పైకి వెళ్లాయి. నితిన్‌ వీటితో పాటు దర్శకుడు కృష్ణ చైతన్యతో ‘పవర్‌ పేట’ అనే ఓ చిత్రాన్ని చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఇది నితిన్‌ కెరీర్‌లో అత్యంత భారీ చిత్రం. దీన్ని రెండు భాగాలుగా తీయబోతున్నట్లు సమాచారం. త్వరలోనే దీన్ని సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన పూర్వ నిర్మాణ పనులు జోరుగా సాగుతున్నాయి. కరోనా పరిస్థితులు ఎప్పుడు చక్కబడితే అప్పుడు సినిమాను ప్రారంభించగలిగేలా రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

1960 నుంచి 2020 వరకూ

‘పవర్‌ పేట’ ఓ వైవిధ్య కథాంశంతో రూపొందనున్న పీరియాడికల్‌ చిత్రం. 1960 నుంచి 2020 వరకు నడిచే కథతో రూపొందనున్నట్లు సమాచారం. దీంట్లో నితిన్‌ 18ఏళ్ల యువకుడిగా, 40ఏళ్ల వ్యక్తిగా, 60ఏళ్ల వృద్ధుడిగా మూడు భిన్నమైన గెటప్పుల్లో దర్శనమివ్వబోతున్నారు. ఇప్పుడీ గెటప్పుల కోసమే ప్రత్యేకంగా హాలీవుడ్‌ మేకప్‌ నిపుణులను తీసుకొస్తున్నట్లు సమాచారం. ఇక ఇందులో కథా నాయికగా కీర్తి సురేష్‌ ఎంపికైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వీళ్లిద్దరూ వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘రంగ్‌ దే’ చిత్రంలో నటిస్తున్నారు.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని