టైమ్‌ స్క్వేర్‌లో అక్తర్‌ తూఫాన్‌ - toofaan promo at time square
close
Published : 13/07/2021 17:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

టైమ్‌ స్క్వేర్‌లో అక్తర్‌ తూఫాన్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: అమెరికాలో బాలీవుడ్‌ సినిమాలు విడుదలవడం కొత్తేం కాదు. న్యూయార్క్‌ నగరంలోని ప్రఖ్యాత టైమ్‌ స్క్వేర్‌లో ప్రచారం చేయడమే అరుదు. ఆ ఫీట్‌ని ఫర్హాన్‌ అక్తర్‌ బీట్‌ చేశాడు. అక్కడ ఏర్పాటు చేసిన భారీ బిల్‌బోర్డ్‌ వీడియోని తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో అభిమానులతో పంచుకున్నాడు.

‘అప్పుడు మొదటిసారి నేను న్యూయార్క్‌లోని టైమ్‌ స్క్వేర్‌కి వెళ్లా. అక్కడ పెద్దపెద్ద బిల్‌బోర్డ్స్‌ని చూశా. నా సినిమా ప్రచారం కూడా ఇలా చేస్తే బాగుండు అనుకున్నా. ఆ కల నిజమైంది. ఇదంతా అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో చలవే’ అంటూ తన ఆనందాన్ని పంచుకున్నాడు. జులై 16న అమెజాన్‌ ప్రైమ్‌ ఓటీటీలో ‘తూఫాన్‌’ని రిలీజ్‌ చేస్తున్నారు. ఈ పోస్టుపై చాలామంది స్పందించారు. ‘ఈ సినిమా కోసం నువ్వెంత కష్టపడ్డావో నాకు తెలుసు. నీ నిబద్ధత, పట్టుదల చాలా మెచ్చుకోదగినది. కొంచెం ముందో, వెనకో ప్రపంచం నీ ప్రతిభను గుర్తిస్తుంది. ఆరోజు కోసం నేను ఆతృతతో ఎదురుచూస్తున్నా’ అంటూ పలువురు ఇన్‌స్టాలో ఫర్హాన్‌ పోస్ట్‌కు సమాధానం ఇస్తున్నారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని