మట్టి వాసన ఉన్న చిత్రమిది: నాని - tuck jagadish press meet
close
Published : 01/04/2021 15:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మట్టి వాసన ఉన్న చిత్రమిది: నాని

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘టక్‌ జగదీష్‌.. మట్టి వాసన ఉన్న చిత్రం’ అని అన్నారు నాని. ఈయన కథానాయకుడిగా శివ నిర్వాణ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘టక్‌ జగదీష్‌’. రీతూ వర్మ, ఐశ్వర్య రాజేశ్‌ నాయికలు. షైన్‌ స్ర్కీన్స్‌ సంస్థ దీనిని నిర్మిస్తోంది. ఏప్రిల్ 23న ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రెస్‌ మీట్‌ ఏర్పాటు చేసింది చిత్రబృందం.

ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ.. ‘నాకు చాలా సంతృప్తినిచ్చిన సినిమా ఇది. ఎప్పుడెప్పుడు మీరందరూ థియేటర్‌కి వచ్చి చూస్తారా అని వేచి చూస్తున్నా. ‘జగదీష్‌’తోపాటు విడుదలయ్యే అన్ని చిత్రాలూ విజయవంతమై ఈ వేసవిని ప్రత్యేకంగా నిలపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది మన సినిమా.. మన మట్టి వాసన ఉన్న సినిమా అనుకునే చిత్రాలు అరుదుగా వస్తుంటాయి. అలాంటిదే ఈ ‘టక్‌ జగదీష్‌’. డీఓపీ ప్రసాద్‌ నటుల్ని, లొకేషల్ని చాలా అద్భుతంగా చూపించారు. సంగీత దర్శకుడు తమన్‌తో ఎప్పటి నుంచో సినిమా చేయాలనుకునేవాణ్ని. అది వాయిదా పడుతూ ఇప్పటికి సాధ్యమైంది. ఒక్క డైలాగ్‌ కూడా లేకుండా టీజర్‌ని కొత్తగా రూపొందించాం. దానికి మంచి స్పందన వచ్చింది. ట్రైలర్‌ రెండు మూడు రెట్లు ఎక్కువ అలరించేందుకు సిద్ధంగా ఉంది. ‘టక్‌ థీమ్‌ మ్యూజిక్‌’ పేరిట ఓ సర్‌ప్రైజ్‌ ఉంబోతుంది’ అని అన్నారు. ‘క్యాచీగా ఉంటుందని ఈ టైటిల్‌ని పెట్టలేదు. దాని వెనక ఆసక్తికర విషయం ఉంది. అది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే’ అని అన్నారు దర్శకుడు శివ నిర్వాణ. ఏప్రిల్‌ 13న వైజాగ్‌లో ట్రైలర్‌ని విడుదల చేస్తున్నట్టు ఈ సందర్భంగా ప్రకటించారు.
మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని