Mandaviya: ‘నా కుమార్తె... నాకు గర్వకారణం’ - union minister mansukh mandaviya has praised his daughter
close
Updated : 27/04/2021 15:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Mandaviya: ‘నా కుమార్తె... నాకు గర్వకారణం’

కొవిడ్‌ వేళ..కూతురిపై కేంద్రమంత్రి ప్రశంసలు

దిల్లీ: ‘నా కుమార్తె..నాకు గర్వకారణం’ అంటూ కేంద్రమంత్రి మన్‌సుఖ్ మాండవీయ గొప్పగా చెప్పుకొంటున్నారు. కరోనా వేళ దేశం క్లిష్టపరిస్థితుల్లో ఉన్న సమయంలో సహకారం అందించడానికి ముందుకు వచ్చిన కూతురి గురించి గర్వపడుతున్నారాయన. ఈ విషయాన్ని మంత్రే స్వయంగా ట్విటర్ వేదికగా వెల్లడించి.. తన కుమార్తె దిశకు మద్దతుగా నిలిచారు. 

‘నా కుమార్తె.. నాకు గర్వకారణం. దిశా.. నువ్వు ఈ బాధ్యతలు నిర్వర్తిస్తుంటే చూడాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను. ఈ క్లిష్ట సమయంలో ముందుకు రావడంపట్ల చాలా గర్వంగా ఉంది. ఈ దేశానికి నీ సేవలు అవసరం. నిన్ను నువ్వు నిరూపించుకుంటావనే నమ్మకం నాకుంది. నా యోధురాలికి మరింత శక్తి సమకూరాలని కోరుకుంటున్నాను!’ అని మాండవీయ తన బిడ్డను ప్రశంసించారు. అలాగే పీపీఈ కిట్‌లో విధులకు సిద్ధంగా ఉన్న ఆమె ఫొటోను షేర్ చేశారు. అది కొవిడ్ రిసోర్స్ కేంద్రంలోనిదిగా తెలుస్తోంది. ఈ ట్వీట్‌ను ఇప్పటికే 36 వేల మందికి పైగా లైక్ చేయగా..‘కుమార్తెలే మిన్న’ అంటూ నెటిజన్లు స్పందిస్తున్నారు.

మన్‌సుఖ్‌ మాండవీయ గుజరాత్‌ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆయన 22ఏళ్ల కుమార్తె దిశ .. వడోదరా మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ చివరి సంవత్సరం చదువుతున్నారు. ప్రస్తుతం ఆమె నగరంలోని కొవిడ్ ఆసుపత్రిలో ఇంటర్న్‌ డాక్టర్‌గా సేవలు అందిస్తున్నారు. ప్రస్తుతం నెలకొన్న విపత్కర పరిస్థితుల్లో తన కుమార్తె అందిస్తున్న సహకారం ఆ తండ్రి మనస్సును మెప్పించింది.



Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని