‘తలైవి’ ట్రైలర్‌ ఆరోజే - update on thalaivi teaser
close
Published : 21/03/2021 10:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘తలైవి’ ట్రైలర్‌ ఆరోజే

చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథతో రూపొందుతున్న పాన్‌ ఇండియా చిత్రం ‘తలైవి’. కంగనా రనౌత్‌ టైటిల్‌ పాత్రలో నటించారు. ఎ.ఎల్‌.విజయ్‌ దర్శకుడు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. ఏప్రిల్‌ 23న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ నేపథ్యంలోనే ట్రైలర్‌ విడుదల చేసేందుకు సిద్ధమైంది చిత్ర బృందం. ఇందుకు కంగనా పుట్టినరోజు మార్చి 23ని ముహూర్తంగా  ఖరారు చేశారు. ఆరోజున చెన్నై, ముంబయిలలో ట్రైలర్‌ విడుదల వేడుకలు నిర్వహించనున్నారు. దీనికోసం ఇప్పటికే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సినిమాలో ఎంజీఆర్‌గా అరవింద్‌ స్వామి కనిపించనుండగా.. కరుణానిధి పాత్రలో ప్రకాష్‌రాజ్‌ దర్శనమివ్వబోతున్నారు. శశికళగా పూర్ణ నటిస్తోంది. జీవీ ప్రకాష్‌ స్వరాలందిస్తున్నారు. విష్ణు ఇందూరి, శైలేష్‌ ఆర్‌.సింగ్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని