ఇంటర్నెట్ డెస్క్: బాలీవుడ్ సుందరి ఊర్వశి రౌతేలా టాలీవుడ్ అరంగేట్రంలోనే భారీ ఆఫర్లు కొట్టేసినట్లు కనిపిస్తోంది. ‘రెడ్ రోజ్’తో తెలుగు ప్రేక్షకులను పలకరించేందుకు ఇప్పటికే సిద్ధమైంది. తన మొదటి చిత్రం విడుదల కాకముందే ఈ ముద్దుగుమ్మకు ఆఫర్లు వరుస కడుతున్నాయట. ఆ మధ్య ‘పుష్ప’లో ఐటమ్ సాంగ్ చేస్తుందనుకున్న దిశాపటానీ ఏవో కారణాలతో తప్పుకుంది. దాంతో ఊర్వశికి స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్‌తో స్టెప్పేసే అవకాశం వచ్చింది. ఇదంతా ఇలా ఉండగా.. ఆమె తాజాగా మరో సినిమాలోనూ ఐటమ్ సాంగ్ చేసేందుకు పచ్చజెండా ఊపిందని తెలుస్తోంది. టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్‌బాబు హీరోగా వస్తున్న ‘సర్కారువారి పాట’లో ఊర్వశి ఐటమ్‌గాళ్‌గా ఉర్రూతలూగించనుందని సినీ వర్గాల్లో జోరుగా చర్చలు సాగుతున్నాయి. అయితే.. దీనికి సంబంధించి ఎలాంటి అధికారికా ప్రకటనా రాలేదు.
ప్రస్తుతం ఊర్వశి ప్రధానపాత్రలో నటించిన తెలుగు చిత్రం ‘బ్లాక్‌రోజ్’ విడుదలకు సిద్ధంగా ఉంది. థ్రిల్లర్ చిత్రంగా వస్తున్న ఈ సినిమాకు మోహన్ భరద్వాజ్ దర్శకత్వం వహించారు. సంపత్‌నంది కథ అందించగా మణిశర్మ స్వరాలు సమకూర్చారు. చిత్తూరి శ్రీనివాస నిర్మాత.
ఇదీ చదవండి..
ఆర్ఆర్ఆర్: రిలీజ్ డేట్ ఫిక్స్
మరిన్ని
కొత్త సినిమాలు
- నిర్మాతలే అసలైన హీరోలు: రామ్ పోతినేని
- ‘హిట్ 2’ ఖరారు.. కేడీ ఎవరు?
-
‘వై’ పోస్టర్ విడుదల!
- అతన్ని చంపబోయాను..అనిల్‌కపూర్
- దేవరకొండవారి ‘పుష్పక విమానం’!
రివ్యూ
ఇంటర్వ్యూ
- ఆ హీరోతో మల్టీస్టారర్ చేయాలనుంది: నితిన్
-
సాయిపల్లవిలాంటి డ్యాన్సర్లుంటే మాస్టర్లకు పండగే
- హీరో కావడం... మాటలు కాదు!
- ప్రేమ సినిమా... ఏది కావాలో తేల్చుకో... అంది!
-
రొటీన్ పాత్రలు చేసి బోర్ కొట్టింది: లావణ్య
కొత్త పాట గురూ
-
వాహ్! అనిపిస్తున్న ‘సారంగదరియా..’
-
‘మనసంతా చేరి మార్చావే దారి’ అంటోన్న సుమంత్
-
‘పైన పటారం..’ అంటున్న అనసూయ
-
‘చిట్టి’ పాటకు ‘చిట్టిబాబు’ స్టెప్పేస్తే..!
-
మాస్ స్టెప్లతో అదరగొట్టిన అనసూయ