close
గుస‌గుస‌లు
ప్రభాస్‌ తల్లిగా అగ్రతార..?

హైదరాబాద్‌: ‘బాహుబలి’, ‘బాహుబలి-2’, ‘సాహో’ చిత్రాల్లో నటించిన ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నారు టాలీవుడ్‌ యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌. ప్రస్తుతం ఆయన రాధాకృష్ణ డైరెక్షన్‌లో ఓ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు ‘జాన్‌’ అనే పేరు ప్రచారంలో ఉంది. పూజాహెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో కృష్ణంరాజు ఓ కీలకపాత్రలో కనిపించనున్నారు. 

ఇదిలా ఉండగా ఈ సినిమాకు సంబంధించిన ఎన్నో ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి. వింటేజ్‌ లవ్‌ స్టోరీగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో కాజల్ అతిథి పాత్రలో నటించనున్నారంటూ ప్రచారం జరిగింది. దీనిపై ఎటువంటి స్పష్టత రాలేదు. అయితే తాజాగా ఈ సినిమాలో ప్రభాస్‌కు తల్లిగా ఒకప్పటి అగ్రకథానాయిక భాగ్యశ్రీ నటించనున్నట్లు సమాచారం. అంతేకాకుండా ఆమె పాత్ర సినిమాలో చాలా కీలకంగా ఉండబోతోందట. ఈ విషయంపై ఇప్పటికే చిత్రబృందం భాగ్యశ్రీని సంప్రదించగా, ఆమె సుముఖత వ్యక్తం చేసినట్లు టాలీవుడ్‌లో రూమర్స్‌ వినిపిస్తున్నాయి. బాలీవుడ్‌లో తెరకెక్కిన ‘మైనే ప్యార్‌ కియా’ సినిమాతో చిత్రపరిశ్రమలో నటిగా భాగ్యశ్రీ చెరగని ముద్ర వేసుకున్నారు. ఈ సినిమాలో భాగ్యశ్రీ నటిస్తున్నారో లేదో తెలియాలంటే చిత్రబృందం అధికారక ప్రకటన కోసం వేచి చూడాల్సిందే.


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.