close
గుస‌గుస‌లు
ఏప్రిల్‌ 10న మాస్టర్‌ విడుదల?

కోడంబాక్కం: లోకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వంలోని ‘మాస్టర్‌’ చిత్రంలో నటిస్తున్నారు విజయ్‌. మాళవిక మోహన్‌ కథానాయిక. విజయ్‌ సేతుపతి విలన్‌పాత్ర పోషిస్తున్నారు. ఆండ్రియా, శాంతను ఇతర తారాగణం. ఇందులో విజయ్‌ కళాశాల విద్యార్థి, ఆచార్యుడిగా ద్విపాత్రాభినయం పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఫస్ట్‌లుక్‌, సెకెండ్‌ లుక్‌లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. సమ్మర్‌ స్పెషల్‌గా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు వార్తలు వినిపించాయి. కానీ అంతకు ముందుగానే ఏప్రిల్‌ 10న సినిమాను విడుదల చేయనున్నట్లు కోలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. అదేరోజున గుడ్‌ఫ్రైడే, ఆ తర్వాత శని, ఆదివారాలు వస్తున్నందున ఆ రోజున విడుదల చేస్తారని తెలుస్తోంది. అంతేకాకుండా ఆ తర్వాత సోమవారం మినహాయిస్తే తమిళ సంవత్సరాది కూడా వస్తోంది. ఇదిలా ఉండగా ఎప్పుడూ లేనివిధంగా ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉండగానే అప్పుడే బిజినెస్‌ ప్రక్రియ కూడా పూర్తయింది. అందువల్ల మాస్టర్‌ చిత్రంపై ప్రేక్షకులు, అభిమానుల మధ్య అంచనాలు విపరీతంగా పెరిగాయి. ఈ చిత్రానికి అనిరుధ్‌ సంగీతం సమకూర్చుతున్నారు. ఎక్స్‌బీ ఫిలిమ్‌ క్రియేషన్స్‌ బ్యానరుపై గ్జేవియర్‌ బ్రిట్టో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.