‘మా’ ఎన్నికల్లో త్రిముఖ పోరు..?  - jeevitha rajasekhar participating in upcoming maa president elections
close
Updated : 23/06/2021 11:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘మా’ ఎన్నికల్లో త్రిముఖ పోరు..? 

ఇంటర్నెట్‌ డెస్క్‌: మా(మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌) ఎన్నికలు ఈసారి మరింత రసవత్తరంగా మారనున్నాయి. ఇప్పటికే ‘మా’ అధ్యక్ష పదవి కోసం మంచు విష్ణు.. ఆ తర్వాత ప్రకాశ్‌రాజ్‌ సిద్ధమయ్యారు. నటి జీవితారాజశేఖర్‌ కూడా ఎన్నికల్లో పోటీ చేసేందుకు సమాయత్తమవుతున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్‌లో ఈ ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి ఎవరూ ఊహించని విధంగా మంచు విష్ణుకు పోటీలోకి దిగుతూ అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశారు. మరోవైపు ప్రకాశ్‌రాజ్‌ ప్రకటన కూడా అలాంటిదే. పైగా ప్రకాశ్‌రాజ్‌కు మెగా బ్రదర్‌ నాగబాబు మద్దతు ప్రకటించారు. ఇప్పుడు ‘మా’ పోటీలోకి జీవిత దిగనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పెద్ద స్టార్లు ఎవరికి మద్దతిస్తారు..? ఎవరు అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికైతే ఈ ముగ్గురు పోరుకు సిద్ధమవుతుండడంతో పోటీ త్రిముఖ పోరుగా మారే అవకాశం ఉంది.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని