Pawan kalyan: అనిల్‌ రావిపూడి కథ వినిపించారా? - will pawan kalyan act under anil ravipudi direction
close
Published : 15/10/2021 01:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Pawan kalyan: అనిల్‌ రావిపూడి కథ వినిపించారా?

హైదరాబాద్‌: అగ్ర కథానాయకుడు పవన్‌కల్యాణ్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. ఇప్పటికే ‘భీమ్లానాయక్‌’ షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ‘హరిహర వీరమల్లు’ కొంతమేర షూటింగ్‌ పూర్తయింది. ఇక హరీశ్ శంకర్‌ దర్శకత్వంలో ‘భవదీయుడు భగత్‌ సింగ్‌’ కూడా త్వరలోనే పట్టాలెక్కనుంది. సురేందర్‌రెడ్డి దర్శకత్వంలోనూ పవన్‌ ఓ సినిమా చేయనున్నారు. తాజాగా మరో డైరెక్టర్‌ పవన్‌కు కథ వినిపించారట. యాక్షన్‌ విత్‌ ఎంటర్‌టైనింగ్‌గా కథ చెప్పడంలో అనిల్‌ రావిపూడి శైలి ప్రత్యేకమైంది. ఆయన తీసిన గత సినిమాలే అందుకు ఉదాహరణ. ఇప్పుడు తాజాగా ఓ సరికొత్త కథను పవన్‌కు వినిపించారని సమాచారం. కథ విన్న పవన్‌ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. అయితే, వరుస సినిమాలు ఉండటంతో ఓకే చెప్పారా? లేదా? అన్నది మాత్రం తెలియరాలేదు. దీనిపై త్వరలోనే స్పష్టత రావచ్చు. అన్నీ ఓకే అయితే, దిల్‌రాజు ఈ సినిమాను నిర్మిస్తారని తెలుస్తోంది. ఇప్పటికే పవన్‌తో కలిసి ఆయన ‘వకీల్‌సాబ్‌’ తీశారు.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని