close
బాలీవుడ్
బాలీవుడ్‌ ముచ్చట్లు

‘మిస్టర్‌ ఇండియా’ రీమేక్‌ గురించి చాలామంది నన్ను అడుగుతున్నారు. ఇప్పటి వరకూ మా నాన్న అనిల్‌కపూర్‌కు కూడా ఆ విషయం తెలియదు. రీమేక్‌ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న అలీ అబ్బాస్‌ జాఫర్‌ సోషల్‌ మీడియాలో పెట్టిన పోస్ట్‌ ద్వారా ఆ విషయం మాకు తెలిసింది. ‘మిస్టర్‌ ఇండియా’కు కీలకమైన నాన్న, ఆ చిత్ర దర్శకుడు శేఖర్‌ అంకుల్‌కు ఆ విషయం చెప్పకపోవడం మర్యాద కాదు. నాన్న సినీ జీవితంలో ‘మిస్టర్‌ ఇండియా’ కీలకమైన చిత్రం’’

- సోనమ్‌కపూర్‌


సినిమా పరాజయం పాలైతే దానికి కారణం ఆ సినిమాకు సంబంధించిన అందరి బాధ్యతే అంటుంటారు. కానీ ‘కళంక్‌’  విషయంలో అలా జరగలేదు. ఆ చిత్రబృందంలో ఎంతో సీనియర్‌ అయిన నా పొరపాట్ల వల్లే సినిమా పోయింది. ‘కళంక్‌’ చిత్రబృందాన్ని నేను సరైన దిశలో నడిపించలేదు. నిర్మాతగా కాస్త ఎక్కువ జోక్యం చేసుకున్నాను. దర్శకుడికి సొంతంగా నిర్ణయాలు తీసుకొని తెరకెక్కించే అవకాశం ఇవ్వలేదనిపిస్తోంది.

- కరణ్‌జోహార్‌


‘సినిమా, టీవీ, డిజిటల్‌ మీడియా....వీటిలో ఎందులో నటించాను అనేది నాకు అనవసరం. నేను నటించే కథ కొత్తగా ఉందా? నా పాత్రలో నటనకు ఆస్కారం ఉందా? అనేదే నాకు అవసరం. నాలుగు షార్ట్‌ఫిలిమ్స్‌ సమ్మేళనంగా తెరకెక్కిన ‘లస్ట్‌స్టోరీస్‌’లో కరణ్‌జోహార్‌ తెరకెక్కించిన ఓ ఎపిసోడ్‌లో నేను నటించాను. అది నా కెరీర్‌లో కీలక మలుపు. నా జీవితంలో ఓ కొత్త ప్రయాణానికి నాంది పలికింది. అప్పుడే నిర్ణయించుకున్నా కథ నచ్చితే ఏ తెరపైనా అయినా నటించాలని. నాలోని నటిని బయటకు తీసుకొచ్చే ఏ అవకాశమైనా నాకు  విలువైందే. అందుకే మరోసారి నెట్‌ఫ్లిక్స్‌లో ‘గిల్టీ’లో నటిస్తున్నాను. ఇందులోని పాత్ర నాకు బాగా నచ్చింది.

- కియారా అడ్వాణీ


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.