close
Published : 09/07/2020 11:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

జాదూ మళ్లీ వచ్చేస్తున్నాడు...

వచ్చే ఏడాది జనవరిలో హృతిక్‌  ‘క్రిష్‌ 4’ సెట్స్‌పైకి!

బాలీవుడ్‌ క్రేజీ స్టార్‌ హృతిక్‌ రోషన్‌ నుంచి సినిమా ఎప్పుడొస్తుందా అని అభిమానులు ఎదురు చూస్తూ ఉన్నారు. ‘క్రిష్’‌ స్వీక్వెల్స్‌లో నాలుగో సినిమా ‘క్రిష్‌ 4’ కోసం ఆశగా ఉన్నారు. 2003లో వచ్చిన ‘కోయి. మిల్‌ గయా’, తర్వాత 2006లో ‘క్రిష్’, 2013లో వచ్చిన ‘క్రిష్‌ 3’ భారీ విజయాలను అందుకున్నాయి. దీంతో ‘క్రిష్‌ 4’ చిత్రంపై అభిమానుల్లో అంచనాలు పెరిగిపోయాయి. అయితే ‘క్రిష్‌ 4’ను ఈ ఏడాది క్రిస్‌మస్‌కే విడుదల చేయాలని తొలుత చిత్రబృందం భావించింది.

అయితే కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో షూటింగ్‌ వాయిదా పడటంతో సినిమా విడుదలపై అభిమానుల్లో అనుమానాలు పెరిగాయి. ఈ క్రమంలో అభిమానులకు తీపి కబురు చెప్పింది చిత్రబృందం. ‘కోయి.. మిల్‌ గయా’లో సందడి చేసిన క్రిష్‌ స్నేహితుడు ‘జాదూ’ మరింత అప్‌డేట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. జాదు సాయంతో క్రిష్‌ తండ్రి, శాస్త్రవేత్త అయిన రోహిత్‌ మెహ్రాను కాపాడుకునే అంశంతో ‘క్రిష్‌ 4’సినిమా వస్తుందని హల్‌చల్‌ చేస్తోంది. ఇప్పటికే ప్రి-ప్రొడక్షన్‌ పని ప్రారంభం కాగా.. విజువల్‌ ఎఫెక్ట్స్‌ను షారుక్‌ ఖాన్‌ సంస్థ రెడ్‌ చిల్లీస్‌ చేసింది. వచ్చే ఏడాది జనవరి నుంచి సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. 


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని