close
బాలీవుడ్
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
శుభవార్త చెప్పిన సైఫ్, కరీనా జంట

ముంబయి: బాలీవుడ్‌ స్టార్‌ కపుల్ సైఫ్అలీ ఖాన్‌, కరీనా కపూర్ అభిమానులకు ఓ శుభవార్త చెప్పారు. కరీనా త్వరలో రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు ప్రకటించింది. ‘మా కుటుంబంలోకి మరో కొత్త వ్యక్తి రాబోతున్నారని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. మీ ప్రేమను ఎల్లప్పుడూ అందించే శ్రేయోభిలాషులకు ధన్యావాదాలు’ అని ఓ ప్రకటనలో వెల్లడించారు. సైఫ్‌, కరీనా 2012లో వివాహబంధంతో ఒక్కటయ్యారు. ఇప్పటికే ఈ జంటకు ఓ కుమారుడు తైమూర్‌ అలీఖాన్‌ (3) ఉన్నాడు. ఈ బుల్లి హీరో ఇప్పటికే సోషల్‌ మీడియాలో చిన్నపాటి స్టార్‌ అయిపోయాడు. ఎప్పుడు కొత్త ఫొటో బయటికొచ్చినా లైక్‌లు, షేర్ల మోత మోగుతున్న విషయం తెలిసిందే. 


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.