Sherlyn Chopra: నన్ను మానసికంగా వేధించారు.. ₹75 కోట్లు ఇవ్వాలని నోటీసులు పంపా! - they threatened me with underworld says sherlyn chopra
close
Published : 28/10/2021 01:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Sherlyn Chopra: నన్ను మానసికంగా వేధించారు.. ₹75 కోట్లు ఇవ్వాలని నోటీసులు పంపా!

ముంబయి: శిల్పాశెట్టి- రాజ్‌కుంద్రా దంపతులు ₹50 కోట్లకు తనపై పరువు నష్టం దావా వేయడంపై మోడల్‌, నటి షెర్లిన్‌ చోప్రా స్పందించారు. శిల్పాశెట్టి- రాజ్‌కుంద్రా తనను అండర్‌ వరల్డ్‌తో బెదిరింపులకు గురిచేశారని తెలిపారు. ఇప్పుడు పరువునష్టం నోటీసులు కూడా ఇచ్చారని, కానీ ఇలాంటివాటికి తాను భయపడను అన్నారు. తనను మానసికంగా వేధించినందుకు గాను రూ.75కోట్లు అడుగుతూ తానే తిరిగి వాళ్లకు నోటీసులు పంపానని వెల్లడించారు. గతంలో రాజ్‌కుంద్రాపై చేసిన ఫిర్యాదుపై విచారణకు తన వాంగ్మూలాన్ని నమోదు చేయాలని పోలీసులను కోరుతున్నట్టు షెర్లిన్‌ తెలిపారు.

రాజ్‌కుంద్రా-శిల్పాశెట్టి దంపతుల తరఫు న్యాయవాదులు ఇటీవల షెర్లిన్‌పై రూ.50 కోట్ల పరువు నష్టం దావా వేశారు. రాజ్‌కుంద్రాపై ఆమె చేసిన ఆరోపణలు నిరాధారమని కొట్టిపారేశారు. షెర్లిన్‌ చెప్పినవన్నీ అవాస్తవమేనని, ఆరోపణల్ని నిరూపించేందుకు ఆమె వద్ద తగిన ఆధారాలూ లేవన్నారు. వివాదాలు సృష్టించేందుకు, మీడియాను ఆకర్షించేందుకు ఆమె ఇలా చేసిందంటూ స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లోనే రాజ్‌కుంద్రాపై కేసు పెట్టిన షెర్లిన్‌.. అతడు తనను లైంగికంగా, మానసికంగా వేధిస్తున్నాడంటూ ఇటీవల మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. షెర్లిన్‌పై పరువు నష్టం దావా వేయడంపై ఆమె తరఫు న్యాయవాది సుహైల్‌ షరీఫ్ స్పందిస్తూ.. వాక్‌స్వాతంత్ర్యాన్ని అణచివేసేందుకు పరువు నష్టం దావాను ఓ ఆయుధంగా వాడుకోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని