close
ఓటీటీ సంగతులు
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
‘దిశా’ ఘటనపై వర్మ చిత్రం: ట్రైలర్‌ చూశారా?

కళ్లకు కట్టేలా చూపించిన ఆర్జీవీ

హైదరాబాద్‌: నగర శివారులో గతేడాది ‘దిశా’ అనే యువతిపై కొంతమంది యువకులు సామూహిక హత్యాచారానికి పాల్పడిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అనంతరం ఆ నిందితుల్ని పోలీసులు ఎన్‌కౌంటర్‌ కూడా చేశారు. అప్పట్లో ఎంతో సంచలనం సృష్టించిన ఈ ఘటనను ఆధారంగా చేసుకుని దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ సారథ్యంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ‘దిశా ఎన్‌కౌంటర్‌’ పేరుతో రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమా ట్రైలర్‌ను శనివారం ఆర్జీవీ సోషల్‌మీడియా వేదికగా విడుదల చేశారు. ఆనంద్‌ చంద్రా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీకాంత్‌, సోనియా, ప్రవీణ్‌ రాజ్‌ ప్రధాన పాత్రలు పోషించారు. ట్రైలర్‌లోని ప్రతి సన్నివేశం ఆనాటి ఘటనను గుర్తుచేసేలా ఉంది. అంతేకాకుండా కొన్ని సన్నివేశాలు భయం తెప్పించేలా ఉన్నాయి.



Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.