కరోనాపై.. చిరు-నాగ్‌ పాట చూశారా?
close
Published : 30/03/2020 08:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనాపై.. చిరు-నాగ్‌ పాట చూశారా?

హైదరాబాద్‌: ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి కరోనా భారత్‌లోనూ తన ప్రతాపాన్ని చూపిస్తోంది. ఈ క్రమంలో తెలుగు సినిమా పరిశ్రమనూ అతలాకుతలం చేసింది. రోజువారీ చిత్రీకరణలు నిలిచిపోవడంతో సినిమా కార్మికులు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. దీంతో సినీ కార్మికులను ఆదుకునేందుకు ప్రముఖ కథానాయకుడు చిరంజీవి ఆధ్వర్యంలో కరోనా క్రైసిస్‌ ఛారిటీ (సి.సి.సి) ఏర్పాటైంది. దీని కోసం పరిశ్రమ వర్గాల నుంచి విరాళాలు సేకరిస్తున్నారు. దీనికి చిత్రపరిశ్రమ నుంచి మంచి స్పందనే వస్తోంది.

తాజాగా దీనిపై మరింత అవగాహన కల్పించేలా సంగీత దర్శకుడు కోటి ఓ పాటను స్వరపరిచి ఆలపించారు. అందులో అగ్ర కథానాయకులు చిరంజీవి, నాగార్జునతోపాటు యువ కథానాయకులు వరుణ్‌తేజ్‌, సాయితేజ్‌ పాలుపంచుకున్నారు. కరోనాపై తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియచేస్తూ.. ఈ వైరస్‌ నిర్మూలనకు చేయాల్సిన కృషిని తెలిపేలా ఈ పాటను రూపొందించారు. ఈ కార్యక్రమంలో ప్రజలను కూడా భాగస్వామ్యుల్ని చేశారు. ఈ పాటను పాడి, రికార్డు చేసి ఆ వీడియో పంపమని చిరంజీవి నెటిజన్లను ట్విటర్‌లో కోరారు. అలా పంపిన వీడియోలను ఎడిట్‌ చేసి వీడియోలో జోడిస్తామని చిరంజీవి పేర్కొన్నారు. వీడియోలు పంపాల్సిన మెయిల్‌ ఐడీ: creatives4ccc@gmail.com

 Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని