close
అవీ.. ఇవీ..
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Comments
‘కరోనా ఓ నీచమైన పురుగు’.. వర్మ పాట విన్నారా!

హైదరాబాద్‌: ‘అది నీచమైన పురుగు.. అయినా మంచే జరుగు..’ అంటున్నారు ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ. ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌పై ఆయన పాటను రూపొందించారు. కరోనా వైరస్‌ను ఓ పురుగుతో పోలుస్తూ ప్రజల్లో అవగాహన కల్పించారు. ఆయన పాడిన ఈ పాట విభిన్నంగా ఉంది. ‘అది ఒక పురుగు.. కనిపించని పురుగు.. కరోనా ఓ పురుగు.. నీ బతుకుకి ఒక చిరుగు..అయినా చివరికి మంచే జరుగు.. నలిపేద్దామంటే అంత సైజు లేదు దానికి. పచ్చడి చేద్దామంటే కండ లేదు దానికి. అదే దాని బలం.. అదే దాని దమ్ము’ అంటూ వర్మ తన స్టైల్‌లో సాహిత్యం రాసి, ఆలపించారు.

ఈ పాటను బుధవారం సాయంత్రం వర్మ ట్విటర్‌ ద్వారా పంచుకున్నారు. శాండీ అడ్డంకి సంగీతం అందించారు. ఈ గీతంతో వర్మ తన మార్క్‌ను మరోసారి ప్రేక్షకులకు చూపించారు. లాక్‌డౌన్‌ విధించింది ప్రజల రక్షణ కోసమని, జాగ్రత్తగా ఉండాలని వర్మ ఈ పాట ద్వారా తెలిపారు. కరోనా కట్టడికి.. ‘నాలుగు ఆయుధాలు ఏంటంటే.. చేతులు కడుక్కో, మాస్క్‌ తొడుక్కో, దూరం పాటించు, గుమ్మం దాటొద్దు..’ అని ప్రజల్లో అవగాహన కల్పించారు.



Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.