
హైదరాబాద్: కరోనాపై పోరాటం చేసేందుకు సినీ ప్రముఖులు తమవంతు ప్రయత్నం చేస్తున్నారు. అగ్ర తారలందరూ భారీగా విరాళాలు ఇవ్వడంతో పాటు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులను, ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నారు. ఇక సంగీత దర్శకులు కీరవాణి, వందేమాతరం శ్రీనివాస్, వాసూరావులతో పాటు గీత రచయితలు అనంత్ శ్రీరామ్, చంద్రబోస్‌లు కరోనాపై అవగాహన పాటలతో అలరిస్తున్నారు.
తాజాగా గాయకుడు, సంగీత దర్శకుడు రఘు కుంచె కూడా ఈ జాబితాలో చేరారు. అందరూ క్లాస్‌గా కరోనాపై పాట పాడితే, రఘు కుంచె మాస్.. కాదు కాదు.. ఊరమాస్ సాంగ్ అందుకున్నారు. ‘సెప్పిన మాట వినకుంటే ఓరి నాయనా..’ అంటూ సిరాశ్రీ అందించిన సాహిత్యాన్ని తనదైన శైలిలో ఆలపించారు. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఇంకెందుకు ఆలస్యం మీరూ చూసేయండి.
Tags :
తాజా వార్తలు
టాలీవుడ్
ఫోటోలు
హీరో మరిన్ని
హీరోయిన్ మరిన్ని
సినిమా స్టిల్స్ మరిన్ని
ఈవెంట్స్ మరిన్ని
జిల్లా వార్తలు

దేవతార్చన
- స్వాగతం అదిరేలా..
- ట్రంప్ వీడ్కోలు: చాలా అందంగా ఉంది
- మద్యం మత్తులో నగ్నంగా చిందేసిన యువతి
- రాధికా ఆంటీ.. నా సీక్రెట్స్ బయటపెట్టేస్తుంది..!
- సిడ్నీ టెస్టు కాగానే ద్రవిడ్ సందేశం పంపించారు
- ట్రంప్‌కు టిమ్ కుక్ గిఫ్ట్.. ఏంటో తెలుసా..?
- ఎవరూ దొరక్కపోతే స్మిత్‌కే సారథ్యం!
- అమ్మో.. టీమ్ఇండియాతో అంటే శ్రమించాల్సిందే
- ఆర్సీబీ నిర్ణయంపై పార్థివ్ పటేల్ జోక్..
- శివమొగ్గలో భారీ పేలుడు.. 8 మంది మృతి