వారి ప్రవర్తన చూసి షాకయ్యా: రజనీకాంత్‌
close
Published : 02/07/2020 01:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వారి ప్రవర్తన చూసి షాకయ్యా: రజనీకాంత్‌

చెన్నై: తమిళనాడులో పోలీసుల అదుపులో ఉన్న తండ్రీ కొడుకులు మరణించిన ఘటనకు సంబంధించి విచారణలో భాగంగా కొందరు పోలీసుల వ్యవహారశైలి తనను షాక్‌కు గురిచేసిందని రజనీకాంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులైన వారికి కఠిన శిక్ష విధించాలంటూ ఆయన డిమాండ్ చేశారు. పి.జయరాజ్, ఆయన కుమారుడు బెనిక్స్‌ లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించి, దుకాణాన్ని తెరిచి ఉంచినందుకు వారిని పోలీసులు అరెస్టు చేశారు. కస్టడీలో ఉన్న వారిని పోలీసులు విచక్షణా రహితంగా కొట్టడంతో మరణించారు. ఆ చర్య తీవ్ర వివాదాస్పదమైంది. ఆ ఘటనకు పాల్పడిన పోలీసులను శిక్షించాలంటూ, ఆ తండ్రీ కొడుకులకు న్యాయం జరగాలంటూ నెటిజన్లు పిలుపునిస్తున్నారు. ఈ క్రమంలో రజనీ  స్పందించారు. 

‘జయరాజ్‌, బెనిక్స్‌ను దారుణంగా హింసించడాన్ని, చంపడాన్ని అందరు ఖండిస్తున్న సమయంలో మేజిస్ట్రేట్‌ను భయపెట్టడానికి ప్రయత్నించిన కొందరు పోలీసుల ప్రవర్తనను చూసి షాక్‌కు గురయ్యాను. ఆ దారుణ చర్యను అందరు ఖండించిన తరవాత వారు ఈ విధంగా స్పందించారు. ఈ కేసుతో సంబంధం ఉన్న వ్యక్తులకు శిక్ష తప్పదు’ అని ట్విటర్ వేదికగా స్పందించారు. 

కాగా, పోస్టుమార్టం నివేదిక ఆధారంగా వారి మరణాలను హత్యలుగా పేర్కొంటూ సదరు పోలీసుల మీద అభియోగాలు మోపవచ్చంటూ మంగళవారం మద్రాస్‌ హైకోర్టు విచారణలో భాగంగా వెల్లడించింది. అలాగే ఈ కేసులో ప్రత్యక్ష సాక్షిగా ఉన్న కానిస్టేబుల్‌కు భద్రత కల్పించాలని ఆదేశాలు జారీ చేసింది.

ఇవీ చదవండి: నన్నేమీ చేయలేవు..మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని