close
Published : 03/07/2020 15:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మహేశ్‌ అరుదైన రికార్డు

హైదరాబాద్‌: అగ్ర కథానాయకుడు మహేశ్‌బాబు అరుదైన రికార్డును అందుకున్నారు. సామాజిక మాధ్యమ వేదికగా ట్విటర్‌లో ఆయనను అనుసరిస్తున్న వారి సంఖ్య 10మిలియన్లు దాటింది. అత్యధికమంది ఫాలోవర్లు కలిగిన దక్షిణాది నటుడిగా మహేశ్‌ నిలిచారు.

ఏప్రిల్‌ 2010 ఖాతాను ప్రారంభించిన మహేశ్‌ ట్విటర్‌ వేదికగా ఎప్పుడూ చురుగ్గా ఉంటారు. తన సినిమాలకు సంబంధించిన విశేషాలతో పాటు, కుటుంబ విషయాలను అభిమానులతో పంచుకుంటారు. అదేవిధంగా సామాజిక సమస్యలపైనా ఆయన స్పందిస్తుంటారు. ఇతర నటీనటుల సినిమాలకు సంబంధించిన పాటలు, ట్రైలర్లు విశేషాలను పంచుకోవడం, వాళ్ల పుట్టినరోజుకు శుభాకాంక్షలు చెబుతుంటారు. ఇక మహేశ్‌ ఇన్‌స్టాను 5.1మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు.

ఈ ఏడాది ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంతో బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని అందుకున్న మహేశ్‌ ప్రస్తుతం పరుశురామ్‌ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ చిత్రంలో నటించాల్సి ఉంది. ఇప్పటికే పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం లాక్‌డౌన్‌ కారణంగా షూటింగ్‌ వాయిదాపడింది. పరిస్థితులు చక్కబడిన వెంటనే మహేశ్‌ రంగంలోకి దిగుతారు.

 



Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని