close
అవీ.. ఇవీ..
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
విజయ్ దేవరకొండకు క్షమాపణలు: నిర్మాణ సంస్థ

హైదరాబాద్‌: విజయ్ దేవరకొండతో సినిమా చేస్తున్నామని ప్రచారం చేసుకుని, తప్పుడు ఆడిషన్స్‌ నిర్వహిస్తున్న తమిళ నిర్మాణ సంస్థ డస్కీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ క్షమాపణలు చెప్పింది. తమ ప్రమేయం లేకుండా ఓ ఏజెన్సీ చేసిన నిర్వాకం వల్ల నిర్మాణ సంస్థ పేరు బయటకు వచ్చినట్లు తెలిపింది. వెంటనే వాళ్ల మీద చర్యలు తీసుకుంటామని, భవిష్యత్‌లో ఇలాంటివి జరగకుండా చూసుకుంటామని పేర్కొంది.

డస్కీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పేరు చెప్పి, విజయ్ దేవరకొండతో సినిమా చేస్తున్నామంటూ కొందరు వ్యక్తులు తెలుగు చిత్ర పరిశ్రమలోని హీరోయిన్లను సంప్రదించారు. విజయ్‌ తమ సినిమాకు సంతకం చేశారని, మీరు కూడా ఒప్పుకోవాలని సదరు కథానాయికలపై ఒత్తిడి తీసుకొచ్చారు. ఈ విషయాన్ని ధ్రువీకరించుకునేందుకు వారు విజయ్‌ బృందాన్ని సంప్రదించగా.. అలాంటిదేమీ లేదనే సమాధానం వచ్చింది. ‘‘విజయ్‌ తన సినిమా అప్‌డేట్స్‌ అధికారికంగా ప్రకటిస్తారు. సోషల్‌మీడియా ఖాతా ద్వారా వాటిని ధ్రువీకరిస్తారు. సదరు నిర్మాణ సంస్థపై చర్యలు తీసుకుంటాం’’ అని ఇటీవల విజయ్‌ టీమ్‌ ప్రకటన విడుదల చేసింది. దీంతో స్పందించిన డస్కీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ తమ తప్పు తెలుసుకుని, విజయ్‌కు క్షమాపణలు చెప్పింది. తప్పుడు ఆడిషన్స్‌కు సంబంధించిన ప్రకటనకు కారణమైన పలువురి ఉద్యోగులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.