‘రామరాజుఫర్‌భీమ్‌’పై ప్రశంసల వర్షం - Celebrities About RRR
close
Published : 22/10/2020 15:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘రామరాజుఫర్‌భీమ్‌’పై ప్రశంసల వర్షం

ఒళ్లు గగూర్పొడిచేలా దృశ్యాలు..

హైదరాబాద్‌: దాదాపు ఐదు నెలల నుంచి సినీ ప్రియులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న రోజు వచ్చేసింది. అభిమానుల ఎదురుచూపులకు సరైన సమాధానం చెబుతూ ‘రామరాజు ఫర్ ‌భీమ్‌’ విడుదలయ్యింది. రాజమౌళి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తోన్న భారీ బడ్జెట్‌ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌ రౌద్రం రణం రుధిరం’. ఇందులో అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌, కొమురం భీమ్‌గా ఎన్టీఆర్‌ కనిపించనున్నారు. అయితే తాజాగా ఈ సినిమా నుంచి కొమురంభీమ్‌గా ఎన్టీఆర్‌ని ప్రేక్షకులకు పరిచయం చేస్తూ ‘రామరాజు ఫర్ ‌భీమ్‌’ పేరుతో ఓ స్పెషల్‌ వీడియోను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందులో దృశ్యాలు ఒళ్లు గగూర్పొడిచేలా ఉన్నాయంటూ.. తారక్‌ వైల్డ్‌గా కనిపించారని పేర్కొంటూ పలువురు సినీ ప్రముఖులు, నెటిజన్లు వరుస ట్వీట్లు చేస్తున్నారు.

‘గత కొన్ని నెలలుగా అలుముకున్న నిరాశ, నిస్పృహ దెబ్బకు పటాపంచలై అదే చోట ఆత్మ స్థైర్యం, ఆత్మ విశ్వాసం మీరు నిలబెట్టిన జెండాల లేచి నిల్చున్నాయి. ఎన్నో విధాలుగా మాలో స్ఫూర్తి నింపినందుకు ధన్యావాదాలు’ - హరీశ్‌ శంకర్‌

‘సూపర్బ్‌.. విజువల్స్‌ కనులపండుగగా అనిపించాయి. వైల్డ్‌, వైల్డెస్ట్‌ మిత్రమా.. టీజర్‌ మరో స్థాయిలో ఉంది. రాజమౌళి అన్నా నీకు నమస్కారం’- మంచు మనోజ్‌

‘వావ్‌.. తారక్‌ బ్రదర్‌.. వీడియో అద్భుతంగా ఉంది.!! మైండ్‌ బ్లోయింగ్‌ టీజర్‌. తన గంభీరమైన స్వరంతో రామ్‌ చరణ్‌ మెప్పించారు. రాజమౌళి సర్‌ మీరు ఎప్పటికీ సూపర్‌’ - దేవిశ్రీ ప్రసాద్‌

‘వాడి పొగరు ఎగిరే జెండా.. వాడి ధైర్యం చీకట్లని చీల్చే మండుటెండ. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీజర్‌లో తారక్‌ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. చరణ్‌ గాత్రం కూడా పీక్స్‌లో ఉంది’- గోపీ మోహన్‌

‘ఇది నిజంగానే అద్భుతం. తారక్‌ నువ్వు చాలా గొప్పగా కనిపించావు. రామ్‌చరణ్‌ అన్నా నీ వాయిస్ ఓవర్‌ బాగుంది. మీ ఇద్దర్ని స్ర్కీన్‌పై చూసేందుకు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నాను’- వరుణ్‌ తేజ్‌

‘వైల్డ్‌గా ఉన్నావు గురూ’- రానా
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని