
ముద్దుగుమ్మ షరతు.. గౌతమ్‌కు తప్పలేదు
ముంబయి: తన భర్త గౌతమ్ కిచ్లు మోకాలిపై వంగి రోజా పువ్వుతో తన ప్రేమను తెలపకపోయి ఉంటే వివాహం చేసుకునేదాన్ని కాదని కథానాయిక కాజల్ సరదాగా అన్నారు. ‘లక్ష్మీ కల్యాణం’తో మొదలైన కాజల్ సినీ ప్రయాణం విజయవంతంగా కొనసాగుతోంది. గత 15 ఏళ్లుగా వైవిధ్యమైన పాత్రలతో అలరిస్తున్న ఈ భామ అక్టోబరు 30న ప్రియుడు గౌతమ్‌ను మనువాడారు. శ్రీమతిగా మారిన తర్వాత కూడా నటనను కొనసాగిస్తానని ఇప్పటికే కాజల్ తేల్చి చెప్పారు. ప్రస్తుతం ఆమె చేతిలో పలు ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. డిసెంబరు 5 నుంచి మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘ఆచార్య’ షూటింగ్లో కాజల్ పాల్గొనబోతున్నట్లు తెలిసింది.
తాజా ఇంటర్వ్యూలో కాజల్ తన భర్త గురించి ముచ్చటించారు. ‘పెళ్లి విషయం గౌతమ్ నా తల్లిదండ్రులతో మాట్లాడారు. దాన్ని నేను ముందే ఊహించా. కాబట్టి పెద్ద సర్ప్రైజింగ్గా అనిపించలేదు. కానీ మోకాలిపై వంగి, ప్రపోజ్ చేయకపోతే పెళ్లి చేసుకోనని చెప్పా (జోక్‌గా). అలా చేసుండకపోతే మనువాడటం కష్టమే..’ అని కాజల్ చెప్పారు.
దీనికి గౌతమ్ స్పందిస్తూ.. ‘అది కొంచెం నాటకీయంగా ఉంటుందని నేను భావించా. కానీ కచ్చితంగా మోకాలిపై వంగాలని కాజల్ షరతు పెట్టింది’ అన్నారు. ‘అవును, నేను కాస్త ఫిల్మిగా ఆలోచిస్తా. గౌతమ్‌కు ఇలాంటి వాటిపై ఆసక్తి ఉండదు. సినిమాలు కూడా చూడడు. నేను బలవంతంగా స్క్రీన్ ముందు కూర్చోబెడుతుంటా’ అని కాజల్ పేర్కొన్నారు.
అనంతరం ప్రియురాలిగా గౌతమ్‌తో మొదటి డేట్ గురించి మాట్లాడుతూ.. ‘తొలిసారి ముంబయిలోని ఎన్సీపీఏ కేఫ్‌కు వెళ్లాం. అక్కడ లంచ్ చేశాం. మా మధ్య సంభాషణ ఓ ఇంటర్వ్యూలా సాగింది (నవ్వుతూ). కానీ సరదాగా అనిపించింది’ అని కాజల్ గుర్తు చేసుకున్నారు.
తాజా వార్తలు
టాలీవుడ్
ఫోటోలు
హీరో మరిన్ని
హీరోయిన్ మరిన్ని
సినిమా స్టిల్స్ మరిన్ని
ఈవెంట్స్ మరిన్ని

దేవతార్చన
- భార్య మరణాన్ని తట్టుకోలేక భర్త మృతి
- అఖిలప్రియకు చంద్రబాబు ఫోన్
- నిహారిక పెళ్లి: మా మధ్య మాటలు తగ్గాయ్
- భారత్‌తో పోల్చాలంటే భయమేస్తోంది: ఛాపెల్
- అట్టుడుకుతున్న రష్యా!
- పంత్ వచ్చి టీమ్ ప్లాన్ మొత్తాన్ని మార్చేశాడు
- టిక్‌టాక్ స్టార్ ఆత్మహత్య
- నిజమైన స్నేహానికి అర్థం భారత్: అమెరికా
- వేదికపై కళ్లు తిరిగిపడిపోయిన డైరెక్టర్
- మేం గెలవడానికి కారణం టిమ్‌పైనే..