
నటుడు నాగబాబు
హైదరాబాద్: పిల్లలు తమ భావాల్ని, తప్పుల్ని చెప్పుకునే స్వేచ్ఛను తల్లిదండ్రులు కల్పించాలని ప్రముఖ నటుడు నాగబాబు అన్నారు. ఆయన తన యూట్యూబ్ ఛానెల్లో ‘కమ్యూనికేషన్’ అనే అంశం గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా తన తల్లి అంజనాదేవి, పిల్లలు వరుణ్ తేజ్, నిహారిక గురించి ప్రస్తావించారు.
‘‘మా అమ్మ పెద్దగా చదువుకోలేదు. కమ్యూనికేషన్ గురించి ఆమెకు తెలియదు. ‘అలా ఉండాలి, ఇలా మాట్లాడాలి’ అని చెప్పేది కాదు. కానీ.. అన్నం పెట్టేటప్పుడు, కౌగిలించుకుని నిద్రపుచ్చే సమయంలో తన స్పర్శ ద్వారా ప్రేమను తెలిపేది. మాతో అద్భుతంగా కమ్యూనికేట్ అయ్యేది. నాకు తెలిసి దీనికి చదువు అవసరం లేదు. వ్యక్తిగతంగా నా కమ్యూనికేషన్ గురించి మీతో షేర్ చేసుకోవాలి. నేను గొప్పగా మాట్లాడకపోవచ్చు, కానీ నా భావాల్ని సరిగ్గా వ్యక్తం చేయగలను. పిల్లలు వరుణ్, నిహారికకు చాలా విషయాల్ని వివరించేవాడిని. పాఠాలతోపాటు ఎలా ప్రవర్తించాలో చెప్పేవాడిని. వాళ్లు తప్పు చేస్తే గట్టిగా మందలించి, తిట్టేవాడిని.. కొట్టాను కూడా. అది నేను చేసిన చిన్న పొరపాటు. పిల్లల్ని కొట్టకూడదు. ఓ రెండుసార్లు అలా జరిగింది. అప్పుడు నాకు పరిపక్వత లేకపోవడం వల్ల అలా చేశా. ‘మాతో ధైర్యంగా మీ భావాల్ని పంచుకోండి’ అని నా కుమారుడు, కూతురికి నేను ఎప్పుడో చెప్పా. తల్లిదండ్రులు కూడా పిల్లలకి అవకాశం ఇవ్వాలి. ‘అమ్మో.. నాన్న దగ్గరికి వెళితే ఏం జరుగుతోందో’ అనే భయం వాళ్లకి ఉండకూడదు’’.
‘‘ఓ రోజు వరుణ్, నిహారికను పిలిచి.. ‘మీ ఇద్దరికీ ఏ సమస్య వచ్చినా.. నేను దాన్ని విని, పరిష్కారం చూపేందుకు ప్రయత్నిస్తాను. మీరు చెప్పుకోలేని తప్పు చేసినా సరే.. నాతో చెప్పండి. ఆవేశంలో ఓ మాట అనొచ్చు.. కానీ సమస్యను తీర్చగలను. ఈ భూమిపై నాకు ముఖ్యమైన వ్యక్తులు మీరిద్దరే’ అన్నాను. ఇప్పుడు మా మధ్య కమ్యూనికేషన్ బాగుంది. వరుణ్ డిగ్రీ మొదటి ఏడాదిలో.. ‘నాన్నా.. సినిమాల్లో నటిస్తాను’ అన్నాడు. నిహారిక కూడా అలానే చెప్పింది. నేను ఓకే చెప్పా. చిత్ర పరిశ్రమలో విజయాలు, అపజయాలు చాలా సామాన్యం. ‘మంచి నటుడ్ని అవుతానని నాన్నకు మాట ఇచ్చాను. ఇప్పుడు నా పరిస్థితి ఇలా ఉంది..’ అని వరుణ్ ఒత్తిడికి గురి కాకూడదు. అందుకే.. ‘పెద్ద హీరో కావాలి, లేకపోతే జీవితం వృథా అనుకోకు. ఎలాగైనా జీవించు, కానీ సంతోషంగా ఉండు. నటుడిగా సాధిస్తే.. ఇంకా మంచిది. లేకపోతే సమస్య లేదు. జీవితాంతం నేను నిన్ను చూసుకుంటా, నేను చనిపోయిన తర్వాత కూడా అన్నీ సౌకర్యాలు ఉండేలా చూస్తా. నువ్వు ఎలా ఉన్నా.. నా కుమారుడివి’ అని చెప్పా. నిహారికతోనూ ఇలానే అన్నాను. చుట్టుపక్కల ఉన్న పది మంది ఏం అనుకుంటున్నారనే విషయం నాకు ముఖ్యం కాదు. నా పిల్లలు సంతోషంగా ఉండటం నాకు కావాలి. సాధించలేకపోయాననే నిరాశ వాళ్లు చెందకూడదు’’ అని నాగబాబు చెప్పారు.
తాజా వార్తలు
టాలీవుడ్
ఫోటోలు
హీరో మరిన్ని
హీరోయిన్ మరిన్ని
సినిమా స్టిల్స్ మరిన్ని
ఈవెంట్స్ మరిన్ని

దేవతార్చన
- సారీ బ్రదర్ నిన్ను కాదు పొడవాల్సింది
- సైఫ్ అలీఖాన్ ఇంటి వద్ద భద్రత కట్టుదిట్టం
- చరిత్రలో నిలిచే పోరాటమిది: గావస్కర్
- కాస్త బంతిని చూడవయ్యా సుందరం: వీడియో వైరల్
- హైదరాబాద్ కేపీహెచ్బీలో దారుణం
- ప్చ్.. ఆధిపత్యానికి వరుణుడు బ్రేక్!
- పాచిపెంట ఎస్సైపై యువకుల దాడి
- కమల వండితే.. అమెరికా ఆహా అంది
- సిరాజ్.. ఇక కుర్రాడు కాదు
- వారెవ్వా సిరాజ్..ఒకే ఓవర్లో రెండు వికెట్లు