సాయంకాలాన.. సాగరతీరాన..!
హైదరాబాద్: తన తండ్రి మోహన్‌బాబుకు నటి మంచు లక్ష్మి స్పెషల్ సర్ప్రైజ్ ఇచ్చారు. తరచూ షూటింగ్స్, ఇతర పనులతో బిజీగా ఉండే మంచువారి కుటుంబం(మోహన్‌బాబు దంపతులు, లక్ష్మి దంపతులు) ఇటీవల వెకేషన్ కోసం మాల్దీవులకు వెళ్లింది. ఈ టూరుకు సంబంధించిన ఫొటోలను లక్ష్మి నెట్టింట్లో పోస్ట్ చేశారు.
‘గత రాత్రి.. బీచ్‌లో విందు ఏర్పాటు చేసి మా నాన్నను సర్ప్రైజ్ చేశాను. మా నాన్న నటించిన చిత్రాల్లోని కొన్ని పాటలను వింటూ.. సాగర అందాలను తిలకిస్తూ.. ఇష్టమైన భోజనాన్ని ఆస్వాదించాం. ఇలా.. మాకోసం మేము ప్రత్యేకంగా కొంత సమయాన్ని గడిపి చాలారోజులు కావడంతో వ్యక్తిగతంగా ఈ క్షణాలు నాకెంతో ఆనందాన్ని అందించాయి’ అని మంచులక్ష్మి పేర్కొన్నారు.
‘సన్ ఆఫ్ ఇండియా’లో ప్రస్తుతం మోహన్‌బాబు నటిస్తున్నారు. ఆ సినిమా చిత్రీకరణ గతేడాది ప్రారంభమైంది. మరోవైపు హిందీలో ప్రేక్షకాదరణ పొందిన ‘లస్ట్ స్టోరీస్’ను తెలుగులో ‘పిట్టకథలు’ పేరుతో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో మంచులక్ష్మి ఓ విభిన్నమైన పాత్రలో నటించారు. ఈ సిరీస్ త్వరలో నెట్‌ఫ్లిక్స్ వేదికగా తెలుగువారికి చేరువకానుంది.
ఇదీ చదవండి..
తారక్ ట్రాఫిక్ జరిమానా చెల్లించిన అభిమాని
మరిన్ని
కొత్త సినిమాలు
-
సందీప్ ఆట సుమ మాట
- కీర్తి.. కొత్త ప్రయాణం
-
‘ప్రాణం పోయినా వదిలిపెట్టను’ అంటోన్న యశ్
-
థియేటర్లు దద్దరిల్లేలా నవ్వటం ఖాయం..!
-
దొంగల ‘హౌస్ అరెస్ట్’
గుసగుసలు
- మోహన్‌బాబు సరసన మీనా!
- ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేసిన రష్మిక..?
- ‘ఆర్సీ 15’.. సంగీత దర్శకుడు అతనేనా?
- మూడో చిత్రం ఖరారైందా?
- పవన్-మహేశ్ పోటీ పడనున్నారా?
రివ్యూ
ఇంటర్వ్యూ
- ఆ కల ‘శివ’తోనే తీరిపోయింది!
-
రొటీన్ పాత్రలు చేసి బోర్ కొట్టింది: లావణ్య
-
‘చెక్’ ఒక ట్రెండ్‌సెట్టర్ అవుతుంది
- నా సినీ భవిష్యత్తును తేల్చే చిత్రమిది!
- డైరెక్టర్ నన్ను నమ్మితే చాలు: నందితాశ్వేత
కొత్త పాట గురూ
-
స్ఫూర్తినిస్తోన్న ‘శ్రీకారం’ టైటిల్ గీతం
-
మాస్ స్టెప్లతో అదరగొట్టిన అనసూయ
-
నిశినలా విసురుతూ..శశినువ్వై మెరవగా
-
‘బతుకే బస్టాండ్..’ అంటూ నితిన్ చిందులు!
-
‘పద్మవ్యూహం లోనికి..’ సుశాంత్!