హైదరాబాద్: దివంగత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు పద్మవిభూషణ్ అవార్డు రావడం తెలుగుజాతికి, గాయక కుటుంబానికి గర్వకారణమని ప్రముఖ సినీ నటుడు, రచయిత, దర్శకుడు తనికెళ్ల భరణి అన్నారు. బాలుతో ‘మిథునం’ చిత్రం నిర్మించడం, అది ప్రపంచ వ్యాప్తంగా మంచి పేరు తెచ్చిపెట్టడం సంతోషంగా ఉందన్నారు. గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని సంకీర్తన గ్రూప్, ఎలివేట్స్ గ్రూప్ సంయుక్తంగా హైదరాబాద్ ఎన్‌కెఎం హోటల్లో నిర్వహించిన సింగర్ మీట్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హజరయ్యారు.
ఈ సందర్భంగా భరణిని నిర్వహకులు ఘనంగా సత్కరించారు. కరోనా ప్రపంచానికి ఎంతో నేర్పిందన్నారు. ప్రపంచమంతా నాదే అనే దురహంకారులకు చెంపపెట్టు కరోనా అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రకృతిని, పర్యావరణ సమతుల్యం కాపాడకపోతే త్వరలోనే ప్రపంచ వినాశం తప్పదనే సత్యాన్ని కరోనా నేర్పిందన్నారు. ఇంట్లో గృహిణులుగా ఉంటూ....కూని రాగాలు పలికే వారికి సాంకేతికత కారణంగా ప్రపంచ వ్యాప్తంగా తమ గొంతుకను వినిపించే సౌలభ్యం కలుగుతోందన్నారు. గొప్ప గాయకులు కాకపోయినా.. తమ సంగీత అభిరుచులకు అనుగుణంగా పాటలు పాడుకునే వారు ఇలా వేదికపై చక్కగా పాడటం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో దాదాపు 45 మంది గాయనీ, గాయకులు తెలుగు రాష్ట్రాల నుంచే కాక పుణె నుంచి వచ్చిన వారు సైతం తమ మధురమైన కంఠస్వరంతో పలు భక్తి, సినీ గీతాలను అలపించి అలరించారు.
మరిన్ని
కొత్త సినిమాలు
-
రెండోసారి.. పంథా మారి
-
మార్చి 5న ‘ఆకాశవాణి’ టీజర్
-
#RRR క్లైమాక్స్ కోసం నిక్ పావెల్ వచ్చేశాడు
-
‘జాతిరత్నాలు’ ట్రైలర్: కడుపుబ్బా నవ్వాల్సిందే!
-
‘సైనా’ రాకెట్‌తో పరిణీతి!
గుసగుసలు
- సుదీప్తో సుజిత్?
- పవన్ భార్యగా సాయిపల్లవి!
- ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేయనున్న ప్రభాస్..!
- ‘పుష్ప’ టీజర్.. ఆరోజేనా?
- దిశను ఓకే చేశారా?
రివ్యూ
ఇంటర్వ్యూ
- ప్రతి మనిషిలోనూ రైతు ఉన్నాడు: బుర్రా
- పవన్..నేనూ హిమాలయాలకు వెళ్లిపోదామనుకున్నాం!
-
మర్డర్ మిస్టరీల్లో ‘క్లైమాక్స్’ ఓ ప్రయోగం!
-
నమ్మించి మోసం చేశారు: జయలలిత
-
అందుకే హాకీని ఎంపిక చేసుకున్నాం!
కొత్త పాట గురూ
-
పునీత్ ‘పాఠశాల..’ సాంగ్ విడుదల!
-
కబడ్డీ..కబడ్డీ..సీటీమార్!
-
ఈ కాలం కన్న.. ఒక క్షణ ముందే నే గెలిచి వస్తానని
-
‘సత్యమేవ జయతే’ వచ్చేసింది
-
‘యుద్ధానికి కావాల్సింది గమ్యం మాత్రమే’