Chiranjeevi: పావలా శ్యామలకు చిరు అండ - chiranjeevi sent 1 lakh rupees to pavala shyamala
close
Published : 19/05/2021 01:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Chiranjeevi: పావలా శ్యామలకు చిరు అండ

ఇంటర్నెట్‌ డెస్క్‌: తెలుగు చిత్రసీమలో ఎవరికి ఎలాంటి ఆపద వచ్చినా నేనున్నానంటూ ధైర్యమిచ్చే నటుడు మెగాస్టార్‌ చిరంజీవి. అందుకే ఆయనను అభిమానులే కాదు ఆర్టిస్టులు కూడా అన్నయ్య అంటుంటారు. తాజాగా చిరు మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. సీనియర్‌ నటి పావలా శ్యామల కష్టాల్లో ఉన్నట్లు తెలుసుకున్న ఆయన చలించిపోయారు. ‘మా’ త‌ర‌పున సభ్యత్వం నిమిత్తం రూ.1,01,500 చెక్కు పంపించారు. సదరు చెక్కును మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఈసీ స‌భ్యులు క‌రాటే క‌ల్యాణి, సురేష్ కొండేటి శ్యామలకు అందజేశారు. ‘మా’లో స‌భ్యురాలైన పావలా శ్యామలకు నెల‌కు రూ.6వేల చొప్పున పెన్షన్ రానుంది. అలాగే ఎవ‌రైనా ఆర్టిస్ట్ అకాల‌ మ‌ర‌ణం చెందితే ఈ కార్డు ద్వారా రూ.3లక్షల ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది.

కొంతకాలంగా ఆమె సినిమాలకు దూరంగా ఉంటున్నారు. నగరంలోని ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. అయితే ఆదాయం వచ్చే మార్గం లేక.. మరోవైపు ప్రభుత్వం నుంచి వచ్చే పెన్షన్‌ కూడా కొంతకాలంగా అందకపోవడంతో ఆమె అద్దె కూడా కట్టలేక తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న నటి కరాటే కల్యాణి..  శ్యామలకు కలిసి కొంత ఆర్థిక సాయం చేశారు. ఆఖరికి తన అవార్డులు అమ్మి రోజులు వెల్లదీస్తున్న శ్యామల దీన స్థితికి సబంధించిన ఒక వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. ఆ సీనియర్‌ నటి పరిస్థితి ఎంతో మందిని కదిలించింది.

కాగా.. చిరంజీవి పంపించిన చెక్కు అందుకున్న శ్యామల మాట్లాడుతూ.. ‘గతంలో చిరంజీవి గారు నాకు రూ.2ల‌క్షల ఆర్థిక సాయం చేశారు. అప్పుడు నేను ఎంతో క‌ష్టంలో ఉన్నాను. నా కుమార్తెకు టీబీ. ఆమెకు చికిత్స చేయించ‌లేని ప‌రిస్థితి. కాలు విరిగి తీవ్ర ఇబ్బందిలో ఉన్న నాకు ఆ రెండు లక్షల ఆర్థిక సాయం ఆదుకుంది. ఇప్పుడు మళ్లీ రూ.లక్షా పదిహేను వందలు సాయం చేశారు. ఆయన చేసిన మేలు ఎప్పటికీ మ‌ర్చిపోలేను. ఆయనకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు’ అని ఆమె పేర్కొంది.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని