Rashmika: 900 కి.మీ ప్రయాణించి.. నిరాశతో వెనుదిరిగి.. - rashmika mandanna fan travels 900 km googles address to meet her
close
Updated : 25/06/2021 04:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Rashmika: 900 కి.మీ ప్రయాణించి.. నిరాశతో వెనుదిరిగి..

రష్మికను కలిసేందుకు అభిమాని కష్టం

హైదరాబాద్‌: ‘ఛలో’, ‘గీత గోవిందం’ వరుస విజయాలతో కెరీర్‌ ఆరంభంలోనే తెలుగు ప్రేక్షకులకు ఎంతో చేరువయ్యారు కన్నడ భామ రష్మిక. తన అందచందాలతో తెలుగు యువతని ఈ బ్యూటీ ఫిదా చేశారు. ఈ నేపథ్యంలోనే రష్మికపై ఉన్న అభిమానంతో ఆమెను కలుసుకోవాలని భావించిన ఓ యువకుడు ఏకంగా 900 కి.మీ ప్రయాణించి ఆమె స్వగ్రామానికి చేరుకున్నాడు. తీరా అక్కడికి వెళ్లాక.. రష్మిక లేదని తెలుసుకుని నిరాశతో వెనుదిరిగాడు.

తెలంగాణ ప్రాంతానికి చెందిన ఆకాశ్‌ త్రిపాఠి అనే యువకుడికి రష్మిక అంటే ఎంతో ఇష్టం. దీంతో గత కొన్నిరోజుల నుంచి ఆమెను కలవాలని అనుకుంటున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా రాష్ట్రంలో లాక్‌డౌన్‌ ఎత్తివేయడంతో అతను రైలులో మైసూరు చేరుకున్నాడు. తర్వాత రష్మిక కుటుంబం ఉండే కూర్గ్‌ జిల్లాలోని విరాజ్‌పేటకు వెళ్లాడు. చుట్టుపక్కల వాళ్లని ఆమె ఇంటికి ఎలా వెళ్లాలని వాకబు చేస్తూ, అదే ప్రాంతంలో గడిపాడు. దీంతో పలువురు స్థానికులు ఆకాశ్‌పై ఫిర్యాదు చేయడంతో పోలీసులు అక్కడికి చేరుకుని.. అతడిని పంపించి వేశారు. అంతేకాకుండా రష్మిక ప్రస్తుతం కర్ణాటకలో లేదని, ముంబయిలో ఉందని వాళ్లు తెలిపారు.

‘కిర్రాక్‌పార్టీ’తో హీరోయిన్‌గా కన్నడ చిత్రపరిశ్రమకు పరిచయమైంది నటి రష్మిక. మొదటి సినిమా విజయం సాధించడంతో ఆమెకు టాలీవుడ్‌లోనూ ఆఫర్స్‌ వరుసకట్టాయి. ఈ క్రమంలోనే ‘సరిలేరు నీకెవ్వరు’, ‘భీష్మ’ చిత్రాల్లో రష్మిక ఆడి పాడారు. ప్రస్తుతం ఆమె చేతిలో ‘పుష్ప’, ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’తో పాటు, ‘మిషన్‌ మజ్ను’, ‘గుడ్‌ బై’ చిత్రాలు ఉన్నాయి. బీటౌన్‌ చిత్రాల షూటింగ్స్‌లో భాగంగానే ఇటీవల రష్మిక ముంబయిలో ఓ ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసినట్లు సమాచారం.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని