‘ప్రియమణి వివాహం చెల్లదు’.. ముస్తాఫారాజ్‌ మొదటి భార్య ఫిర్యాదు - telugu news priyamani marriage with mustafa raj is illegal
close
Published : 23/07/2021 01:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘ప్రియమణి వివాహం చెల్లదు’.. ముస్తాఫారాజ్‌ మొదటి భార్య ఫిర్యాదు

ముంబయి: తనకి విడాకులివ్వకుండా ముస్తఫారాజ్‌ నటి ప్రియమణిని వివాహం చేసుకున్నారంటూ ఆయన మొదటి భార్య ఆయేషా ఆరోపించారు. ప్రియమణి-ముస్తఫాల వివాహం చట్టపరంగా చెల్లుబాటు కాదని ఆమె అన్నారు. ఈ మేరకు ప్రియమణి దంపతులపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా ముస్తఫా తనని శారీరకంగా ఇబ్బందిపెట్టాడంటూ ఆయనపై కేసు పెట్టారు. ఈ విషయంపై ఆమె తాజాగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందించారు.

‘ఇప్పటికీ ముస్తఫా నాకు భర్తే. చట్టప్రకారం నా నుంచి ఆయన విడాకులు తీసుకోలేదు. ఇప్పటివరకూ మేమిద్దరం విడాకుల కోసం దరఖాస్తు కూడా చేయలేదు. కాబట్టి ప్రియమణితో ఆయన పెళ్లి చెల్లదు. ఎన్నో సంవత్సరాల నుంచి ఈ విషయాన్ని బయటపెట్టాలనుకున్నప్పటికీ ఇద్దరు పిల్లల తల్లిగా పరిస్థితుల కారణంగా పెదవి విప్పలేకపోయాను. కానీ, ఇప్పుడు పరిస్థితులు తారుమారయ్యాయి. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను’ అని ఆయేషా తెలిపారు. మరోవైపు ఆయేషా పెట్టిన కేసుపై స్పందించిన ముస్తఫా.. ‘ఆయేషా కావాలనే ఇదంతా చేస్తోంది. ఆమె నుంచి విడిపోయిన రోజు నుంచి పిల్లల సంరక్షణ నేనే చూసుకుంటున్నాను. నా బాధ్యతగా వాళ్ల సంరక్షణకు కావాల్సిన డబ్బుల్ని పంపిస్తున్నాను. అంతేకాకుండా 2017లో నేనూ-ప్రియమణి వివాహం చేసుకున్నాం. మా వివాహమైన ఇన్ని సంవత్సరాల తర్వాత ఆయేషా ఈ విధంగా ఆరోపణలు చేస్తోంది’ అని అన్నారు.

దక్షిణాదిలోనే కాకుండా బాలీవుడ్‌లోనూ నటిగా గుర్తింపు తెచ్చుకున్న ప్రియమణి 2017లో ముస్తఫా రాజ్‌ను ప్రేమ వివాహం చేసుకున్నారు. వివాహానంతరం కూడా ఆమె పలు సిరీస్‌లు, సినిమాలతో ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు. ఇటీవల విడుదలైన ‘ది ఫ్యామిలీ మ్యాన్‌-2’, ‘నారప్ప’ ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని