Viva Harsha: వేడుకగా వైవా హర్ష వివాహం - telugu news cini celebrities attend to viva harsha wedding
close
Published : 22/10/2021 01:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Viva Harsha: వేడుకగా వైవా హర్ష వివాహం

హైదరాబాద్‌: ‘వైవా’ సిరీస్‌తో నటుడిగా గుర్తింపు తెచ్చుకుని.. ప్రస్తుతం పలు సినిమాల్లో హాస్యనటుడిగా రాణిస్తున్నారు హర్ష. బుధవారం ఆయన ఏడడుగుల బంధంలోకి అడుగుపెట్టారు. నగరానికి చెందిన అక్షరతో ఆయన వివాహం ఘనంగా జరిగింది. నగరంలోని ఓ ప్రముఖ ఫంక్షన్‌ హాల్‌ ఈ వేడుకకు వేదికగా మారింది. ఏడు రోజులపాటు జరిగిన పెళ్లి వేడుకల్లో వధూవరుల కుటుంబసభ్యులు, స్నేహితులతోపాటు పలువురు సినీ ప్రముఖులు సైతం పాల్గొన్నారు. దర్శకుడు మారుతి, నటుడు ప్రవీణ్‌, స్వాతి రెడ్డి, మహాతల్లి ఫేమ్‌ జాహ్నవి పాల్గొని వధూవరులకు అభినందనలు తెలిపారు. మరోవైపు సుహాస్‌ కథానాయకుడిగా నటించిన ‘కలర్‌ఫొటో’లోనూ హర్ష తనదైన నటనతో మెప్పించారు. ఇటీవల విడుదలైన ‘గల్లీరౌడీ’లోనూ హర్ష నటించారు.



Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని