ఇందువదన: వడివడిగా సుడిగాలిగా.. - vadi vadiga lyrical video song induvadana varun sandesh
close
Updated : 06/07/2021 23:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఇందువదన: వడివడిగా సుడిగాలిగా..

ఇంటర్నెట్‌ డెస్క్‌: వరుణ్‌ సందేశ్‌ సందడి షురూ చేశాడు. ‘ఇందువద మకథతో అలరించేందుకు సిద్ధమయ్యాడు. ఎమ్‌ఎస్‌ఆర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వరుణ్‌ సరసన ఫర్నాజ్‌ శెట్టి సందడి చేయనుంది. ఇటీవల విడుదల చేసి ఫస్ట్‌లుక్‌ అందరి దృష్టిని ఆకర్షించింది. చిత్రబృందం తాజాగా నుంచి ఒక పాట విడుదల చేసింది. ‘వడివడిగా సుడిగాలిగా వచ్చి’ అంటూ సాగే పాట యువతను ఆకట్టుకునేలా ఉంది. ఈ చిత్రంలో రఘుబాబు, ఆలీ, నాగినీడు, సురేశ్‌వాణి, తాగుబోతు రమేశ్‌, ధన్‌రాజ్‌, మహేశ్‌విట్ట కీలకపాత్రలు పోషిస్తున్నారు. శ్రీబాలాజీ పిక్చర్స్‌ పతాకంపై మాధవి ఆదుర్తి నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం. తాజాగా విడుదలైన ఈ పాటకు తిరుపతి జావన లిరిక్స్‌ అందించగా జావిద్‌ అలీ, మాళవిక ఆలపించారు. శివకాకాని సంగీతం అందించారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని