close
అవీ.. ఇవీ..
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
సినీనటి వాణిశ్రీ కుమారుడు ఆత్మహత్య

చెన్నై: సీనియర్‌ నటి వాణిశ్రీ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆమె కుమారుడు అభినయ వెంకటేశ్‌ కార్తీక్‌(36) ఆత్మహత్య చేసుకున్నారు. చెంగల్‌పట్టు జిల్లా తిరుక్కలికుండ్రంలోని ఫామ్‌హౌస్‌లో అభినయ్‌ బలవన్మరణానికి పాల్పడ్డారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

బెంగళూరులోని అన్నపూర్ణ మెడికల్ కళాశాలలో అభినయ్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఇటీవల తిరుక్కలికుండ్రంలోని ఓ బంగ్లాను అభినయ్‌ కొనుగోలు చేశారు. లాక్‌డౌన్‌ కారణంగా ఎటూ వెళ్లలేని పరిస్థితి ఉండటంతో గత కొన్ని రోజులుగా అక్కడే ఉంటుంటున్నారు. ఈ నేపథ్యంలో అదే బంగ్లాలో ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టించింది. మానసిక ఒత్తిడి కారణంగా అభినయ్‌ ఆత్మహత్య చేసుకున్నారని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. శవ పరీక్ష నిమిత్తం మృతదేహాన్ని చెంగల్‌పట్టు ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం.

అందుకే కుమారుడికి మూడు పేర్లు

నటి వాణిశ్రీకి ఒక కూతురు, ఒక కొడుకు. ముగ్గురు కొడుకులను కనాలని వాణిశ్రీ అనుకునేవారట. అయితే, అనారోగ్య సమస్య కారణంగా ఒక్కడితో సరిపెట్టుకున్నానని ఓ సందర్భంలో చెప్పారు. అందుకే తన బాబుకు అభినయ వెంకటేశ కార్తీక్‌ అని మూడు పేర్లు పెట్టుకున్నానని చెప్పారు. అమ్మాయి పేరు అనుపమ. ఇద్దరూ వైద్య విద్యను అభ్యసించారు. అభినయ్‌ భార్య కూడా వైద్యురాలే.



Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు