Cinema News: కొత్త సినిమాలు పట్టాలెక్కేస్తున్నాయ్‌! - varudu kavalenu and narudi brathuku natana shoots starts today
close
Published : 24/06/2021 13:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Cinema News: కొత్త సినిమాలు పట్టాలెక్కేస్తున్నాయ్‌!

హైదరాబాద్‌: తెలుగు చిత్రపరిశ్రమలో మళ్లీ సందడి వాతావరణం ప్రారంభమవుతోంది. లాక్‌డౌన్‌ కారణంగా సుమారు కొన్ని నెలల నుంచి షూటింగ్స్‌ నిలిచిపోయాయి. కాగా, లాక్‌డౌన్‌ సడలింపుల్లో భాగంగా ఇప్పుడిప్పుడే సినిమాలు సెట్స్‌పైకి అడుగుపెడుతున్నాయి. ఈ క్రమంలోనే గురువారం తాజాగా రెండు సినిమాలు పట్టాలెక్కాయి. మరోవైపు అగ్రహీరోలు, దర్శకుల ప్రాజెక్ట్‌లు సైతం ఈ వారంలోనే సెట్స్‌లోకి ఎక్కే అవకాశం ఉన్నట్లు సమాచారం.

వరుడు కావలెను

నాగశౌర్య కథానాయకుడిగా తెరకెక్కుతోన్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘వరుడు కావలెను’. లక్ష్మి సౌజన్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూట్‌ వాయిదా అనంతరం తిరిగి నేడు ప్రారంభమైంది. ఇందులో నాగశౌర్యకు జంటగా రీతూ వర్మ సందడి చేయనున్నారు. కూల్‌, క్లాసిక్‌ లుక్‌లో నాగశౌర్య కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమాలోని ‘కోలా కళ్లే ఇలా’ పాట ప్రతి ఒక్కర్నీ ఎంతో ఆకర్షించింది. కొన్ని ముఖ్యమైన సన్నివేశాలు మినహాయించి.. ‘వరుడు కావలెను’ షూట్‌ చాలావరకు పూర్తయినట్లేనని సమాచారం.

నరుడి బ్రతుకు నటన

‘గుంటూరు టాకీస్‌’ ఫేమ్‌ సిద్దు జొన్నలగడ్డ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘నరుడి బ్రతుకు నటన’. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రానున్న ఈ చిత్రానికి  విమల్‌ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రద్ధా శ్రీనాథ్‌, నేహాశెట్టి కథానాయికలు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని